పచ్చి బఠానీలు అధికంగా లభించే సీజన్ ఇదే. మిగతా కాలలతో పోలిస్తే.. ఇప్పుడు పచ్చి బఠానీ ధర చాలా తక్కువగా ఉంటుంది.. ఎక్కువగా లభిస్తుంది.
ఇక వీటితో చేసిన వంటలను ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు. అందుకే వీటిని.. పలావ్, ఫ్రైడ్ రైస్, చాట్లలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
పచ్చి బఠానీల్లో పోషకవిలువలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.
అంతేకాక షుగర్ పేషెట్లకు ఇవి మంచి ఔషధంలా ఉపయోగపడతాయి. షుగర్ పేషంట్లు వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
పచ్చి బఠానీల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపర్చడమే కాక.. బరువు తగ్గేందుకు కూడా బాగా సహాయపడతాయి.
అయితే పచ్చిబఠానీలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అని చెప్పి..
వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది కాదని.. అలా చేస్తే.. పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఉబ్బరం సమస్య.. పచ్చి బఠానీలను ఎక్కువ మొత్తంలో తింటే కడుపు ఉబ్బరం వస్తుందని పలు నివేదికలు వెల్లడించాయి.
హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం ప్రకారం.. పచ్చి బఠానీలలో లెక్టిన్, ఫైటిక్ వంటి కొన్ని యాంటీ న్యూట్రియెంట్స్ ఉంటాయి.
ఇక బఠానీల్లో లెక్టిన్ ఎక్కువ మొత్తంలో ఉండదు. కనుక.. బఠానీలను ఒకేసారి ఎక్కువ మొత్తంలో తింటే.. కడుపు ఉబ్బరం సమస్యకు దారి తీస్తుంది.
పోషకాలను తక్కువ శోషణకు దారితీస్తుంది..
పచ్చి బఠానీలు పోషకాలతో నిండి ఉంటాయి. అలానే వాటిలో కొన్ని యాంటీ న్యూట్రియెంట్స్ కూడా ఉన్నాయి.
మరీ ముఖ్యంగా పచ్చి బఠానీలలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మీ శరీరంలో ఇనుము, కాల్షియం, జింక్ శోషణను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు..
మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం..
పచ్చి బఠానీలలో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కనుకు వీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతుంది.
ఫలితంగా ఇది.. శరీరంలో కీళ్ల నొప్పులకు కారణమయ్యే యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది.
బఠానీలు మొత్తానికే మానేయాలా..
బఠానీలు మొత్తానికే మానేయాలా..
బఠానీలను ఎక్కువగా తింటే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు.. కనుక వీటిని మొత్తానికే తినడం మానవద్దు.
ఎందుకంటే పచ్చి బఠానీలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అందుకే వీటిని ఖచ్చితంగా మన ఆహారంలో చేర్చుకోవాలి.
అయితే పచ్చి బఠానీల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే.. వీటిని తగినంత మోతాదులోనే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇందుకోసం.. పచ్చి బఠానీలు తినే మొత్తాన్ని తగ్గించాలి.
అలాగే ప్రతిరోజూ బఠానీలు తినకూడదు
వంట చేయడానికి ముందు బఠానీలను నానబెట్టడం, పులియబెట్టడం, మొలకెత్తించడం వల్ల .. దానిలో ఉండే లెక్టిన్ కంటెంట్ తగ్గుతుంది.