చాలా మందిని బాధించే సమస్యల్లో వెన్ను నొప్పి ఒకటి.

గంటల తరబడి కుర్చీల్లో కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి లేదా నడుం నొప్పి వస్తుంది.

కారణం ఏదైనా వెన్ను నొప్పి పెట్టే బాధ అంతా ఇంతా కాదు. 

కూర్చున్నా నొప్పే..  పడుకున్నా నొప్పే.. ఎక్కువ సేపు నిలబడినా నొప్పే, వంగినా నొప్పే.. 

వెన్ను నొప్పి తగ్గేందుకు మందులు, అయింట్మెంట్ లు ఉపయోగిస్తూ ఉంటారు.

ఈ సమస్య  తగ్గేందుకు కొన్ని ఇంటి చిట్కాలు కూడా బాగా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మసాజ్ తో తలనొప్పితో పాటుగా వెన్ను నొప్పి నుంచి కూడా ఉపశమం కలుగుతుంది. 

నొప్పి ఎక్కువైనప్పుడు అయింట్మెంట్ పెట్టి, లేదా ఏదైనా నూనె రాసి కాసేపు మసాజ్ చేయండి. 

నొప్పి మరీ ఎక్కువగా అనిపిస్తే వెంటనే చల్ల నీళ్లు లేదా వేడినీళ్లతో కాపడం పెట్టండి.

ఐస్ ముక్కలను పెట్టినా కూడా వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

హై హీల్స్ వేసుకుంటే కూడా నడుం నొప్పి వచ్చే అవకాశం ఉంది. 

అందుకే హై హీల్స్ ను తరచుగా వేసుకోవడం మానేయండి. 

అంగుళం కంటే ఎక్కువ ఎత్తుండే చెప్పులను వేసుకోకపోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. 

నడక ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

రోజూ గంటలకు గంటలు కూర్చునే వారు ప్రతిరోజూ ఒక అర్థగంట అయినా నడవాలి.

పనిలో ఒకసారైనా లేచి అటూ ఇటూ నడవడం మంచిది. 

బరువులు ఎత్తడం వల్ల కూడా వెన్ను నొప్పి ఎక్కువయ్యే అవకాశం ఉంది.

 అందుకే బరువు ఎత్తేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.