మొలకెత్తిన గింజలు లేదా మొలకల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.
మొలకెత్తిన పెసర్లు, శనగలు, పల్లీలు, బఠాణీలు, గోధుమలు, జొన్నలు, సోయా బీన్స్, చిక్కుడు వంటివి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి శరీరాన్ని శుద్ధి చేస్తాయి.
మొలకెత్తిన గింజలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో తోడ్పడతాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.
గర్భిణీలు మొలకెత్తిన గింజలు తింటే బిడ్డలు ఆరోగ్యంగా పుడతారు
మొలకెత్తిన గింజలు తింటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
ఈ మొలకల్లో క్యాల్షియం, ఐరన్, జింక్, ఫాస్ఫరస్ వంటివి ఉంటాయి. ఇవి దంతాలను, ఎముకలను దృఢంగా ఉంచుతాయి. రక్తహీనత కూడా తగ్గుతుంది.
మొలకెత్తిన గింజలతో.. తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, టమాటా, పసుపు, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసుకుని తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.
మొలకలతో కీర, బీట్ రూట్ తురుము కలుపుకుని తిన్నా కూడా ప్రయోజనం ఉంటుంది.
శనగలు, పెసర్లు, పల్లీలు, సోయా చిక్కుడు గింజలను తీసుకుని.. 6 నుంచి 8 గంటల పాటు నీటిలో నానబెట్టాలి.
నానబెట్టిన గింజలను పొట్టు రాకుండా బాగా శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఆ గింజలను శుభ్రమైన వస్త్రంలో ఉంచి మూట కట్టాలి.
తడి ఆరకుండా మూటపై నీళ్లు చల్లుతూ ఉండాలి. గింజలను బట్టి మొలకెత్తడానికి 8 గంటలు పడుతుంది.
కాలాలను బట్టి కూడా మొలకెత్తడంలో సమయంలో మార్పులు ఉంటాయి.
వేసవి కాలంలో గింజలు త్వరగా మొలకెత్తితే.. మిగిలిన కాలాల్లో ఒకటి లేదా రెండు రోజుల సమయం పడుతుంది.
అయితే ఈ మొలకెత్తిన గింజలను సాయంత్రం 6, 7 గంటల సమయంలో తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
మధ్యాహ్న భోజనంలో మాంసాహారం తింటే సాయంత్రం సమయంలో మొలకెత్తిన గింజలను తీసుకోవచ్చు. దీని వల్ల మాంసాహారంలో ఉన్న అధిక కొవ్వులు కరుగుతాయి.
ఆకలేస్తే చిరుతిండ్లను తినకుండా మొలకలను తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇది కేవలం అంతర్జాలం నుంచి సేకరించిన సమాచారం మాత్రమే. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి.