సాధారణంగా టమాట కూర వండని ఇల్లు ఉండదు. వాటిని మనం రోజూ కూరల్లో వేస్తుంటాం.

అయితే టమాటాల్లో ఉండే విటమిన్లు మన శరీరానికి పూర్తి స్థాయిలో అందాలి అంటే మాత్రం వాటిని కూరగా తీసుకోరాదు.

టమాటను నూనెలో వండుకుని తీనటం కంటే అలాగే ఉడికించి తింటే అనేక ప్రయోజనాలు శరీరానికి చేకూరుతాయి అంటున్నారు నిపుణులు.

ప్రతీ రోజూ 3 టమాటాలను ఉడకబెట్టి బ్రేక్ ఫాస్ట్ తో కలిపి తీసుకుంటే కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టమాటాల్లో పుష్కలంగా విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఎ, సి లు ఎక్కువగా ఉంటాయి. 

వీటి వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో సీజనల్ వ్యాధులు మీ దరిచేరవు.

ఇక విటమిన్ ఎ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. 

దాంతో కంటికి సంబంధిచిన వ్యాధులు రాకుండా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

టమాటాలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తుంది.

ఇక టమాటాల్లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. 

బరువును అదుపులో పెట్టడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

షుగర్ వ్యాధిగ్రస్తులకు టమాటాలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తాయి.

విటమిన్ సి వల్ల చర్మం ప్రకాశవంతంగా, మృదువుగా మారుతుంది. అదీకాక చర్మ క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది.

నోట్: పై చిట్కాలను పాటించే ముందు దగ్గర్లోని డాక్టర్ల, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోండి.