ఈ మధ్యకాలంలో చాలా మంది యువతులు, మహిళలను వేధించే సమస్య అవాంఛిత రోమాలు.
మరీ ముఖ్యంగా పైపెదవి, నుదురు, చెవులు దగ్గర కాస్త దట్టంగా వెంట్రుకలు పెరిగి.. చూడటానికి ఇబ్బందిగా కనిపిస్తాయి.
దీన్ని తొలగించుకోవడం కోసం చాలా మంది క్రమం తప్పకుండా పార్లర్‌కు వెళ్లడం.. లేదంటే.. లేజర్ ట్రీట్‌మెంట్ తీసుకోవడం చేస్తారు.
కానీ వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలతో అవాంఛిత రోమాల సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టవచ్చు. అవేంటంటే..
మన ఆరోగ్యానికి, అందానికి పసుపు చేసే మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇక పసుపుతో పైపెదవి మీద వచ్చే వెంట్రుకలను సులభంగా తొలగించుకోవచ్చు.
ఇందుకుగాను పాలలో కాస్త పసుపు కలిసి పేస్ట్‌లా చేసి పైపెదవి మీద రాయాలి.
అరగంట ఆగిన తర్వాత మృదువుగా రుద్దితే వెంట్రుకలు వాటంతట అవే రాలిపోతాయి.
ఇక గుడ్డులోని తెల్లసొనతో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇందుకోసం మొక్క జొన్న పిండి, గుడ్డు తెల్లసొన కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి.
దీన్ని పైపెదవి మీద అప్లై చేసి.. ఆరిన తర్వాత కడిగితే.. వెంట్రుకలు ఊడిపోతాయి.
ఇక పెరుగు, శనగపిండి, పసుపు ఈ మూడింటిని కలిసి పేస్ట్‌లా చేసి.. పైపెదవి మీద అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగితే.. వెంట్రుకలు వచ్చేస్తాయి.
అలానే మొక్కజొన్న పిండి, పాల మిశ్రమం కూడా పైపెదవి మీద ఉన్న వెంట్రుకను ఎలాంటి నొప్పి లేకుండా తొలగిస్తుంది.
ఈ రెండు పదార్థాలను కలిపి.. పైపెదవి మీద అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే.. ఫలితం ఉంటుంది.
అలానే తేనె, నిమ్మరసం మిశ్రమం.. పార్లర్‌లో వాడే మైనం మిశ్రమాన్ని పోలి ఉంటుంది.
దీన్ని పైపెదవిపై అప్లై చేసి.. 10 తర్వాత బాగా రుద్ది కడితే వెంట్రుకలు తొలగిపోతాయి.
అలానే గోధుమపిండి, పాలు, పసుపు బాగా కలిపి.. ఈ మిశ్రమాన్ని పైపెదవి మీద రాయాలి.
30 నిమిషాలు అలానే ఉండి.. తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం వెంట్రుకలను తొలగించడమే కాక.. ట్యాన్‌ను కూడా నిర్మూలిస్తుంది.
అలానే నిమ్మరసంలో కాస్త చక్కెర వేసి.. పైపెదవి మీద స్క్రబ్‌లా రుద్దాలి. ఇది కూడా ఎలాంటి నొప్పి లేకుండా వెంట్రుకలను తొలగిస్తుంది.