మారిన ఆహారపు అలవాట్ల కారణంగా నేటి కాలం యువత తొందరగా అనారోగ్య పాలవుతున్నారు.
పాశ్చాత్య దేశాల మాదిరిగా ఆహారంలో కాస్త మార్పులు చేసుకుని చిన్న వయసులోనే షుగర్, బీపీ, స్థూలకాయం వంటి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దగ్గరవుతున్నారు.
ఇలాంటి రోగాల నుంచి బయటపడేందుకు నేటి కాలం యువత వ్యాయమాలు, యోగాలు చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు.
మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రధానంగా చాలా మంది ఎదుర్కొనే సమస్య.. స్థూలకాయం.
ఈ స్థూలకాయంతో 25 ఏళ్ల వయసులోనే 40 ఏళ్ల మనుషుల్లా కనిపిస్తుంటారు.
నోటికి తాళం వేయకుండా ఎప్పుడు పడితే, ఏదిపడితే అది తింటూ బరువు పెరిగిపోతున్నారు.
ఈ స్థూలకాయ సమస్య నుంచి తొందరగా బయటపడేందుకు వ్యాయమాలు, యోగాలు చేస్తూ చెమటోడ్చుతున్నారు.
అయితే చాలా మంది స్థూలకాయంతో బాధపడుతుంటారు.
అలాంటి వారు రోజూ రెండు గ్లాసుల మోసంబి జ్యూస్ తీసుకుంటే తక్కువ సమయంలోనే బరువును తగ్గించుకునే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
మనకు విరివిగా దొరికే బత్తాయి పండుని మోసంబి అని కూడా పిలుస్తారు.
ఇందులో సెట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఈ జ్యూస్ ను రోజూ తీసుకోవడం ద్వారా జంక్ ఫండ్ ను తీసుకోవాలనే కోరికలను రానివ్వదు.
అధిక బరువుతో బాధపడేవారు ఈ మోసంబి జ్యూస్ ను రోజూ రెండు గ్లాసులు తీసుకోవాలి.
ఈ మోసంబి జ్యూస్ ను రోజూ రెండు గ్లాసులు తీసుకోవడం ద్వారా కడుపులో ఫుల్ గా నిండిపోయిన భావనను కలిగిస్తుంది.
శరీర జీవక్రియను మెరుగుపరచడంతో పాటు కొవ్వును కరిగించడానికి తోడ్పాటును అందిస్తుంది.
ఇలా అధిక బరువుతో బాధపడేవారు రోజూ రోండు గ్లాసుల మోసంబి జ్యూస్ తీసుకోవడం ద్వారా తొందర్లనే మంచి ఫలితాలు చూస్తారని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
గమనిక: ఈ చిట్కాలను పాటించే ముందు వైద్యులు సంప్రదించవలసిందిగా మనవి.