ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ ధరలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మల్లుతున్నారు.

కాకపోతే ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలంటే వాటి ధర కూడా లక్షల్లో ఉంటోంది.

అయితే ఇప్పుడు ఓ కంపెనీ ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు శుభవార్త చెబుతోంది. కేవలం 35 వేలకే వాహనాన్ని అందిస్తోంది.

ఇప్పటికే బజాజ్, హీరో, ఓలా, ఎథర్ వంటి ఎన్నో కంపెనీలు ఉన్నాయి. వాటికి ఇంకా కొన్ని కొత్త కంపెనీలు కూడా వచ్చి చేరుతున్నాయి.

IIT ఢిల్లీకి చెందిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్టార్టప్ కంపెనీ బాజ్ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలోకి అడుగుపెట్టింది.

దుమ్ము, ధూళిని తట్టుకునేందుకు IP65 సర్టిఫికేట్ కూడా ఉంది.

ఈ స్కూటర్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే  100 కిలో మీటర్లు ప్రయాణం చేయచ్చు.

ఈ స్కూటర్ కేవలం 1624 mm మాత్రమే పొడవు ఉంటుంది.

దీని విడ్త్ కేవలం 680 mm మాత్రమే. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

అంతేకాకుండా దీనిని నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసర్లేదు.

90 సెక్లలోనే మీ బైక్ బ్యాటరీస్ మార్చుకొని నిరంతరాయంగా ప్రయాణం సాగించవచ్చు.

ఈ స్కూటర్ లో వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. 

అలాగే ఫోర్క్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉంది. ఇది వాహనాన్ని ఎంతో స్మూత్ గా వెళ్లేందుకు సహకరిస్తాయి.

దీనిలో ఫైండ్ మై బైక్ ఫీచర్ ఉంది. మీ స్కూటర్ ఎక్కడున్నా గుర్తించొచ్చు.

ఈ బైక్ గరిష్టంగా 25 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలదు.