పైన ఫొటొలొ కనిపిస్తున్న యువతి పేరు రవళి. వయసు 26 ఏళ్లు. నిజమాబాద్ జిల్లాకు చెందిన ఈ యువతి ఉన్నత చదువులు పూర్తి చేసింది. ఇక రవళి తల్లిదండ్రులు కూతురుని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు.

పెళ్లి వయసు రావడంతో కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నారు. ఇక ఇందులో భాగంగానే రవళి తల్లిదండ్రులు ఇటీవల ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగితో నిశ్చితార్థం కూడా జరపించారు.

తెల్లారితే పెళ్లి.., రవళి తల్లిదండ్రులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. కట్ చేస్తే ఆదివారం తెల్లవారుజామున యువతి ఊహించని షాక్ ఇచ్చింది.

అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? తెల్లారితే పెళ్లి అనగా రవళి ఏం చేసిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నిజామాబాద్ జిల్లా నవీపేట్ ప్రాంతంలో ర్యాగల్ల ప్రభాకర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి రవళి (26) అనే కూతురు ఉంది. కూతురుకి పెళ్లి వయసు రావడంతో ప్రభాకర్ నిజామాబాద్ కు చెందిన సంతోష్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగితో ఆగస్టులో నిశ్చితార్థం జరిపించారు.

ఇక కూతురుకి కూడా సంతోష్ నచ్చడంతో నిశ్చితార్థం జరిగిన నాటి నుంచి రవళి సంతోష్ తో తరుచు ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది. అయితే ఈ క్రమంలోనే సంతోష్ కాబోయే భార్యను పెళ్లికి ముందే ఉద్యోగం చేయాలని వేధింపులకు గురి చేసేవాడని తెలుస్తుంది.

ఇదే కాకుండా పలు రకాలైన వేధింపులకు కూడా పాల్పడినట్లు సమాచారం. ఇక పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. ఆదివారం పెళ్లి రోజు కావడంతో రవళి తల్లిదండ్రులు నిజామాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో కూతురు పెళ్లి ఘనంగా చేయాలని అన్ని ఏర్పాట్లు చేశారు.

బంధువులు అంతా ఇంటికి చేరడంతో ఇంట్లో అంత సందడిగా మారింది. ఇక యదావిధిగా శనివారం రాత్రి బంధువులు అంతా తిని పడుకున్నారు. ఇక తెల్లవారు జామున రవళి బంధువులు ఆమె బెడ్ రూంలోకి వెళ్లి చూడగా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.

ఈ సీన్ ను చూసిన రవళి తల్లిదండ్రులు, కటుంబ సభ్యులు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. తెల్లారితే పెళ్లిపీటలెక్కాల్సిన అమ్మాయి ఇలా ఉరితాడుకు వేలాడడంతో రవళి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.

కాబోయే భర్త రవళిని తరుచు వేధించేవాడని, పెళ్లికి ముందే జాబ్ చేయాలని టార్చర్ పెట్టాడని, అతని వేధింపులు భరించలేకే మా కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.

ఈ ఘటననపై స్పందించిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.