సాధారణంగా మన రోజూ తినే రకరకాల ఫుడ్స్ కారణంగా చాలా అనారోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నాం.
ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడేందుకు చాలా టాబ్లెట్స్, సిరప్స్ వాడుతుంటాం.
అయితే వంటింట్లో ఉండే కొన్ని దినుసులు ఉపయోగించి కూడా మన ఆరోగ్యాన్ని కరెక్ట్ గా ఉంచుకోవచ్చు.
అలా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడే వాటిలో నల్లని ఎండుద్రాక్ష.. ఎప్పుడూ టాప్ లోనే ఉంటుంది.
దీని వల్ల చాలా బెన్ ఫిట్స్ ఉన్నాయి.
అజీర్తితో బాధపడేవారు రోజూ రాత్రి గ్లాస్ పాలలో 5-7 ఎండు ద్రాక్షల్ని వేసి 10 నిమిషాల తర్వాత ఆ పాలు తాగితే సమస్యలు తొలగిపోతాయి.
ముఖంపై ముడతలతో ముసలివాళ్లలా కనిపిస్తున్నవారు..
ఈ నల్లని ఎండుద్రాక్ష మిశ్రమం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
10-12 నల్ల ఎండుద్రాక్షని పౌడర్ లో తేనె కలిపి ఫేస్ కి మసాజ్ చేయాలి.
కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో ముఖయం కడగటం వల్ల ముడతలు క్రమంగా తొలగిపోతాయి.
ఎండుద్రాక్షలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది.
దీనివల్ల హై బీపీతో పాటు చెడు కొలెస్ట్రాలు తగ్గుతుంది. గుండె పదిలంగా ఉంటుంది.
ఎండిన నల్ల ద్రాక్షలో క్యాల్షియం చాలా ఉంటుంది. దీన్ని రోజూ తీసుకుంటే బాడీలోని ఎముకలు గట్టిగా మారుతాయి. త్వరగా పెళుసుబారవు.
నోటి దుర్వాసనతో బాధపడుతున్నవారు.. రాత్రి పడుకునే సమయంలో ఒక 10 లేదా 12 నల్లని ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టాలి.
తర్వాత రోజు ఉదయం ఆ నీటిని 10 నిమిషాలపాటు మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వాటిని తాగటం వల్ల నోటి దుర్వాసన నుంచి విముక్తి పొందవచ్చు.
నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గరలోని డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోవడం ఉత్తమం.