రణపాల మొక్క గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అందరూ ఇష్టంగా ఇంటి వద్ద, ఆఫీస్ వద్ద అలంకరణ మొక్కగా పెంచుతారు.
అందం కోసం పెంచుకునే ఈ రణపాల మొక్కలో ఎన్నో రోగాలు నయం చేసే గుణం ఉందట.
రణపాల మొక్క సుమారుగా 150 కి పైగా రోగాలను నయం చేస్తుందట.
రణపాల మొక్క యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ వైరల్, యాంటీ మైక్రో బయల్ లాంటి లక్షణాలు ఉంటాయి.
ఈ మొక్క యొక్క ఆకులు కాస్త మందంగా.. తింటే వగరు, పులుపుగా అనిపిస్తాయి.
మరి ఈ మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రణపాల ఆకులను తినడం ద్వారా జీర్ణాశయ సమస్యలు తగ్గుతాయి.
రణపాల ఆకులను తినడం అజీర్ణం, మలబద్ధకం సమస్యలను నివారిస్తుందంట.
ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు, విరేచనాలతో బాధపడే వారికి రణపాల ఆకు మంచి ఔషధం.
ఈ ఆకుల్లో వుండే యాంటీఫైరటిక్ వల్ల మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వున్న వారికి మంచి మేలు చేస్తుంది.
ఈ రణపాల ఆకులను రోజు తినడం వలన డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు చాలా మేలు చేస్తుంది.
రణపాల ఆకుల రసం మజ్జిగలో కలిపి కొద్దిగా ఉప్పు వేసి తాగితే విరేచనాలు తగ్గిపోతాయి.
రణపాల ఆకు స్త్రీలలో జరిగే రక్త స్రావాన్నీ కూడా ఆపుతుంది.
ఇలా రణపాల మొక్కల ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయి.