శిలాజిత్తు గురించి చాలా మందికి తెలియదు. దానిని ఏదో పదార్థం అనుకుంటారు.

అయితే శిలాజిత్తును ఎవరూ తయారు చేయరు. స్వతహాగా అదే ఏర్పడుతుంది.

ఇది ఖనిజాల జాతికి చెందింది. హిమాలయాలు, పర్వత శ్రేణుల్లో లభిస్తుంది.

దీనిని ఎన్నో ఏళ్లుగా ఆర్వేదంలో వాడుతున్నారు. దీని ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఇదొక రేర్ రెసిన్.. మొక్కలు, వృక్ష సంపదం వేల సంవత్సరాలు కుళ్లిపోతాయి.

అలా రాళ్ల్ మధ్య ఇరుక్కుని వేల సంవత్సరాల తర్వాత శిలాజిత్తుగా తయారవుతుంది.

శిలాజిత్తు ద్వారా మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఆహారం బాగా జీర్ణమవుతుంది.

బరువు తగ్గాలని కోరుకునే వారికి ఈ శిలాజిత్తు బాగా ఉపయోగపడుతుంది.

పురుషులకైతే వీర్యకణాభివృద్ధి జరుగుతుంది. వీర్యం నాణ్యత కూడా పెరుగుతుంది.

ఐరన్ అధికంగా ఉండటం వల్ల.. రక్త హీనత నుంచి బయటపడచ్చు.

అల్జీమర్స్ వ్యాధికి శిలాజిత్తు సరైన పరీష్కారంగా చెబుతారు.

శిలాజిత్తు ఔషదం పొడి, లిక్విడ్, క్యాప్సూల్స్ రూపంలో అందుబాటులో ఉంది.

రోజుకు 500 ఎంజీ మోతాదు వరకు వాడుకోవచ్చు. లిక్విడ్ అయితే 3 చుక్కల వరకు వాడచ్చు.

అయితే వీటిని గర్భిణీలు, గౌట్ సమస్య ఉన్నవారు, కీళ్ల నొప్పులు కలిగిన వారు మాత్రం వైద్యుల సూచన మేరకే వాడాల్సి ఉంటుంది.

నోట్: పైన తెలిపిన చిట్కాలు పాటించే ముందు మీ దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోండి.