చలికాలం వచ్చిందంటే దగ్గు, జలుబు, మడమలు పగలడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.

తేమ తక్కువవ్వడం వల్ల చర్మం పొడిబారడం, మడమల్లో పగుళ్లు ఏర్పడతాయి.

అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మడమల పగుళ్ల సమస్య నుంచి బయటపడచ్చు.

చలికాలంలో సబ్బుని ఎక్కువగా వాడడం వల్ల చర్మం పొడిబారుతుంది. చర్మంపై ఉన్న తేమను తగ్గిస్తుంది.

అందుకే సబ్బుని అతిగా రుద్దుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. 

చలికాలంలో సబ్బుకి బదులు కలబంద లేపనం లేదా సున్నిపిండి వంటివి వాడితే మంచిది.  

పాదాలు, మడమలు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొబ్బరినూనెతో మసాజ్ చేయాలి. 

ఇలా చేస్తే చర్మంపై తేమ శాతం పెరిగి.. పగుళ్లు రాకుండా ఉంటుంది. అలానే రక్తప్రసరణ కూడా బాగుంటుంది. 

చలికాలంలో చాలా మంది వేడి నీటిలో తమ పాదాలను ఉంచుతారు. అయితే అలా వేడి నీటిలో పాదాలు తడపడం వల్ల తేమ తగ్గుతుంది

అందుకే వేడి నీటిలో పాదాలను ఉంచకూడదని అంటున్నారు.   

పాదాల పగుళ్ళ సమస్యకి ఉప్పు చక్కని పరిష్కారం. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి.. ఆ ఉప్పు నీటిలో పాదాలను 20 నిమిషాల పాటు ఉంచాలి

అలా చేస్తే మడమల పగుళ్లు తగ్గుతాయి. 

బేకింగ్ సోడా కూడా మడమల పగుళ్ళను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. 

ఒక బకెట్ గోరు వెచ్చని నీటిలో బేకింగ్ సోడా, ఉప్పు కలపండి. ఆ నీటిలో 15 నిమిషాల పాటు పాదాలను ఉంచితే.. పగుళ్లు రావు. 

నిమ్మకాయ కూడా మడమల పగుళ్ళ సమస్యకి చక్కని పరిష్కారం అని చెప్పవచ్చు. 

గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి.. పాదాలను ఆ నీటిలో ముంచితే పగుళ్ల సమస్యలు ఉండవు. 

అలానే పాదాలకు నిమ్మకాయ చెక్కను రుద్దండి. దీని వల్ల పాదాలు అందంగా కనిపిస్తాయి.

గోరు వెచ్చని నీటిలో కొద్దిగా షాంపూ, కొద్దిగా నిమ్మరసం కలిపి.. ఆ నీటిలో పాదాలను 30 నిమిషాల పాటు ఉంచండి.

అలా చేస్తే పాదాలు మృదువుగా, కోమలంగా తయారవుతాయి. వారంలో 3 సార్లు ఇలా చేస్తే పగుళ్ల సమస్య నుంచి బయటపడచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ చిట్కాలు పాటించే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.