మేడి చెట్టుని పూజించే సంప్ర‌దాయం పూర్వ‌కాలం నుంచి ఉంది. కానీ ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు.

మ‌హా ఆయుర్వేద సంప‌ద కూడా ఈ మేడి చెట్టులో ఉంది. దీనిని చాలా సులువుగా పెంచుకోవ‌చ్చు.

సంస్కృతంలో మేడి చెట్టుని ఉదుంబ‌ర‌, దత్తాత్రేయ, క్షీర వృక్షం అని, హిందీలో గుల‌ర్ అని పిలుస్తుంటారు.

మేడి చెట్టు టేస్టు వ‌గ‌రుగా ఉంటుంది. దీంతో ప్ర‌యోజ‌నాల కూడా చాలానే ఉన్నాయి. పలు అనారోగ్య సమస్యలని దూరం చేసుకోవచ్చు.

స్త్రీలలో యోని, ఉబ్బు, వ్ర‌ణాల‌ ప్రాబ్లమ్స్ తో పాటు పైత్యం, అతి మూత్ర, ర‌క్త పైత్యాన్ని త‌గ్గించ‌డంలో మేడి చెట్టు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.

మేడి చెట్టు లేత ఆకుల పొడిని అర టీ స్పూన్ నుంచి టీ స్పూన్ మోతాదులో తేనెతో క‌లిపి రెండు పూట‌లా తీసుకుంటూ ఉంటే పైత్య రోగాలు త‌గ్గుతాయి.

గ‌వ‌ద బిళ్లలు(టాన్సిల్స్), క‌ణ‌తుల‌ను త‌గ్గించే శ‌క్తి మేడి చెట్టు పాల‌కు ఉంది. ఈ పాలను వాటిపై దూదిలో ముంచి ఉంచడం వల్ల అవి త‌గ్గుతాయి.

మేడి ప‌ళ్ల క‌షాయం, ర‌సం తాగ‌డం వ‌ల్ల అధిక దాహం స‌మ‌స్య త‌గ్గుతుంది. ఈ రసాన్ని 10 నిమిషాల పాటు పుక్కిలించి ఉమ్మి వేయ‌డం వల్ల నోటి పూత త‌గ్గుతుంది.

మేడి చెట్టు వేరును నీటితో క‌లిపి మెత్త‌గా నూరి అరి కాళ్ల‌కు రాయ‌డం వల్ల సుఖ ప్ర‌స‌వం జ‌రుగుతుంది.

మేడి చెట్టుకు పూజ చేసి దాని వేరు, చిన్న మొక్క‌ను కానీ తెచ్చుకుని ప‌సుపు, కుంకుమ చ‌ల్లి నీడ‌లో ఎండ‌బెట్టాలి.

దానిని వెండి లేదా రాగి తాయ‌త్తులో ఉంచి మెడ‌కు కానీ మొల‌కు కానీ క‌ట్టుకోవ‌డం వ‌ల్ల మాన‌సిక బ‌ల‌హీనత త‌గ్గి ధైర్యంగా త‌యార‌వుతారు.

ఇలా చేయ‌డం వల్ల ధ‌న న‌ష్టం క‌లిగిన వారికి మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భించ‌డ‌మే కాకుండా తిరిగి ధ‌నాన్ని సంపాదించుకునే శ‌క్తి ల‌భిస్తుంద‌ని పండితులు చెబుతున్నారు.

స్త్రీల‌లో నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే అతి ర‌క్త‌స్రావం స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో కూడా మేడి చెట్టు ఉప‌యోగ‌ప‌డుతుంది.

మేడి చెట్టు కాయ‌ల‌ను క‌ట్ చేసి ఎండ‌బెట్టి పొడిలా చేసుకోవాలి. 100 గ్రాముల మేడి కాయల పొడికి 100 గ్రా. ప‌టిక బెల్లం పొడిని, 50 గ్రా. తేనెను క‌లిపి నిల్వ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని 10 గ్రా. చొప్పున తీవ్ర‌త‌ను బ‌ట్టి రెండు లేదా మూడు పూట‌లు తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అధిక ర‌క్తస్రావం స‌మ‌స్య త‌గ్గుతుంది.

మేడి కాయ‌ల‌ను, మోదుగ పువ్వుల‌ను స‌మ‌పాళ్ల‌లో క‌లిపి నువ్వుల నూనెతో మెత్త‌గా నూరాలి. ఈ మిశ్ర‌మానికి కొద్దిగా తేనెను క‌లిపి రాత్రి పూట యోనికి లేప‌నంగా రాస్తే అది బిగువుగా త‌యార‌వుతుంది.

మేడి చెట్టు బెర‌డు పొడి, మ‌ర్రి చెట్టు లేత ఆకుల పొడి, ప‌టిక బెల్లం పొడిని స‌మ‌పాళ్ల‌లో క‌లిపి పూట‌కు 10 గ్రా.ల చొప్పున రెండు పూట‌లా తీసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని వేడి పాల‌తో కలిపి తాగ‌డం వ‌ల్ల పురుషుల‌ల్లో వీర్య నష్టం త‌గ్గి, వీర్యం గ‌ట్టి ప‌డ‌డంతోపాటు సంభోగ‌ శ‌క్తి కూడా పెరుగుతుంది.

మేడి పండ్ల‌లోని గింజ‌ల‌ను ఎండ‌బెట్టి పొడిలా చేయాలి. పూట‌కు మూడు గ్రాముల చొప్పున ఆవు వెన్న‌తో క‌లిపి తినడం వ‌ల్ల వృధాప్య ఛాయ‌లు త‌గ్గుతాయి.

గ్లాస్ నీటిలో మేడి చెక్క‌ను ప‌గ‌ల‌కొట్టి వేసి ఒక క‌ప్పు క‌షాయం అయ్యే వ‌ర‌కు మ‌రిగించి వ‌డ‌క‌ట్టాలి. ఒక టీ స్పూన్ బార్లీ గింజ‌ల పొడి, ఒక టీ స్పూన్ ప‌టిక బెల్లం పొడిని క‌లిపి తాగాలి.

ఇలా రోజూ చేస్తూ ఉంటే గ‌ర్భ‌స్రావం అవ‌కుండా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

నోట్: పై టిప్స్ పాటించేముందు మీ దగ్గరలోని డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోవడం ఉత్తమం.