మనం వంటల్లో ఉపయోగించే మసాలా దినుసుల్లో మిరియాలు కూడా ఒకటి. వీటిని క్వీన్ ఆఫ్ స్పైసెస్ గా పిలుస్తారు.
మిరియాల వల్ల వంటల రుచి పెరగడం సహా ఆరోగ్యానికీ ఎంతో మేలు కలుగుతుంది. దీనిలోని పోషకాలతోపాటు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.
వీటి గొప్పతనం తెలుసుకున్నారు కాబట్టే మన పూర్వీకులు మిరియాలను వంటల్లో భాగంగా చేశారు.
ఆయుర్వేద వైద్యులు.. మిరియాలను చాలారకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
మిరియాల్లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
మిరియాలను రోజూ ఉదయం పరగడుపున ఒకటి లేదా రెండు మిరియాలను నమిలి మిగడం వల్ల చాలా ప్రయోజనాలను పొందొచ్చు.
మిరియాలను ఫుడ్ లో వేయడం వల్ల మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తరుచూ ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం.
అజీర్తి సమస్యతో బాధపడే వారు మిరియాలను పాత బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
ఒక గ్లాస్ మజ్జిగలో మిరియాల పొడిని వేసి కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.
చిటికెడు మిరియాల పొడిని బాదం పప్పుతో కలిపి తీసుకోవడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి.
బరువుతో బాధపడేవారు భోజనానికి అరగంట ముందు మిరియాల పొడిని తేనెతో కలిపి తీసుకుని, గ్లాస్ వేడి నీటిని తాగితే మంచి ఫలితాలను ఉంటాయి.
నీటిలో మిరియాల పొడి కలిపి తీసుకోవడం వల్ల దాహం వేయడం తగ్గుతుంది.
జలుబు, తుమ్ములతో బాధపడేవారు పసుపు, మిరియాల పొడిని నీటిలో మరిగించి తీసుకోవడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్ల వాపు సమస్యలు ఉన్నవారు మిరియాల పొడిని, రాళ్ల ఉప్పుతో కలిపి చిగుళ్లపై ఉంచడం వల్ల చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి.
నువ్వుల నూనెలో మిరియాలను వేయించి పొడిగా చేయాలి. ఈ పొడిని నొప్పి ఉన్న ప్రాంతంలో రాసి కట్టు కట్టడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
మొటిమలతో బాధపడేవారు మిరియాల పొడిని, పసుపుతో కలిపి రాయడం వల్ల అవి త్వరగా తగ్గిపోతాయి. స్మూత్ చర్మం ఉన్నవారు ఈ చిట్కా పాటించొద్దు.
గాయాలు తగిలినప్పుడు మిరియాల పొడిని రాయడం వల్ల రక్తస్రావం తగ్గడంతోపాటు గాయాలు కూడా త్వరగా మానుతాయి.
మిరియాలను తినడం వల్ల మేలు కలుగుతుంది కదా అని వీటిని ఎవరు పడితే వారు తీసుకోకూడదు.
కడుపులో మంట, టైంకు ఆహారాన్ని తీసుకోని వారు, అధిక వేడితో బాధపడే వారు వీటిని ఎక్కువగా తీసుకోకూడదు.
నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోండి.