ఆయుర్వేదం అనే సినిమాలో లీడ్ రోల్ పసుపే. అపర సంజీవనిగా పేరున్న పసుపుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఇంట్లో స్త్రీలు ఏదో ఒక పని మీద అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. కాళ్లకు పసుపు రాసుకోవడం వల్ల ఇంట్లో నేల మీద ఉండే క్రిములు శరీరంలోకి ప్రవేశించే వీలుండదు

పాదాలు, మడమల పగుళ్ళను కూడా పసుపు ఆపుతుంది.

గడపకు పసుపు రాయడం వల్ల హానికారక సూక్ష్మక్రిములు ఇంట్లోకి రావు. దీని వల్ల ఇంట్లో వాళ్లకి రోగాలు రావు.

అలానే గాయాలు తగిలినప్పుడు పసుపు రాస్తే గాయాలు త్వరగా నయమవుతాయి. పసుపు యాంటీ సెప్టిక్ గా పని చేస్తుంది.

మరుగుతున్న నీటిలో పసుపు కలిపి ఆవిరి పడితే.. దగ్గు, జలుబు తగ్గుతాయి. కఫం ఉన్నవారు పాలలో పసుపు కలుపుకుని తాగితే తొలగిపోతుంది.

గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు ఉన్నవారు.. పసుపు, వేపాకుని కలిపి మెత్తగా నూరి.. ఆ మిశ్రమాన్ని చర్మం మీద రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఉప్పు, పసుపు మిశ్రమంతో పళ్ళను తోముకోవడం వల్ల దంతాల సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి.

పాలలో పసుపు, మిరియాల పొడి మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు తాగితే.. దగ్గు తగ్గుతుంది.

పసుపు, గంధం, పెరుగు సమపాళ్లలో తీసుకుని ముఖం మీద పేస్ట్ లా రాసుకోవాలి.

30 నిమిషాల తర్వాత నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.

ఆముదంలో కొద్దిగా పసుపు కలిపి.. చర్మంపై అప్లై చేసి 10, 15 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మచ్చలు, దద్దుర్లు, చర్మ వ్యాధులు తగ్గుతాయి.

రాత్రి కొత్తిమీర రసంలో పసుపు కలిపి ముఖానికి రాసుకుని నిద్రపోవాలి. ఉదయం లేచాక ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. 

 ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. అలానే చర్మం మృదువుగా తయారవుతుంది.  

గమనిక: ఈ చిట్కాలు పాటించే ముందు నిపుణులు లేదా వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.