తులసికి ఆధ్యాత్మికంగానే కాదు.. ఆయుర్వేదం పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్నట్లు తెలిసిందే.
ఎన్నో జబ్బుల నివారణలో తులసి కీలకం అని ఆయుర్వేదం చెబుతోంది.
మీరు తులసిని వాడటం వల్ల ఈ 11 రకాల జబ్బులకు దూరంగా ఉండచ్చు.
నాలుగైదు తులసి ఆకులను మెత్తగా నూరి మాత్రగా చేసుకుని రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తీసుకుంటే గ్యాస్, మలబద్ధకం తగ్గుతాయి.
రోజూ ఉదయాన్నే 4 తులసి ఆకులను నోట్లో వేసుకుని నమిలి మింగడం వల్ల ఒంట్లో ఉన్న కఫం మాయమవుతుంది.
జలుబు, జ్వరం ఉన్నప్పుడు తులసి ఆకు రసం, అంతే మోతాదులో తేనె కలుపుకుని రోజూ మూడుపూటల తీసుకోవడం వల్ల త్వరగా నయం అవుతుంది.
ఉదయాన్నే 4 తులసి ఆకులు తినడం వల్ల జీర్ణాశయంలో ఉండే చెడు క్రిములు నశించిపోయాతి. జీర్ణవ్యవస్థ శుద్ధు జరుగుతుంది.
తులసి ఆకులను నీడలో ఎండబెట్టి పొడిచేసి.. రోజూ పళ్లు తోముంకోవాలి. దాని ద్వారా పళ్లపై ఉండే పసుపు, గార పోతాయి.
జ్వరం త్వరగా తగ్గాలి అంటే.. నాలుగు తులసి ఆకులు, నాలుగు పుదీనా ఆకులను వేసి మరిగించి ఉదయం, సాయంత్రం ఓ కప్పు తాగితే త్వరగా తగ్గుతుంది.
రోజూ ఉదయాన్నే ఒక టీస్పూన్ తేనె, టీ స్పూన్ తులసి రసం కలిపి తీసుకుంటే కంఠస్వరం మృధువుగా మారుతుంది.
తులసి ఆకులని మరిగించి పూటకు ఒక కప్పు చొప్పున తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి.
తులసి ఆకు రసం, ఉప్పి రసం, అల్లం రసం, తేనెలను కలిపి.. 6 టీస్పూన్ల చొప్పున రెండుసార్లు తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి.
బరువు తగ్గాలంటే రాత్రి పూట పలుచటి మజ్జిగలో తులసి ఆకు రసం కలిపి తీసుకుంటే కొవ్వు కరుగుతుంది.
రాత్రి పూట తులసి ఆకు రసం టీస్పూన్, తేనె లేదా చక్కెర కలిపి తీసుకుంటే నిద్ర బాగా వస్తుంది.
నోట్: పైన టిప్స్ ఫాలో అయ్యే ముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.