పుదీనా ఆకులలో ఎన్నో రకాల ఔషద గుణాలు దాగి ఉన్నాయనేది మన అందరికీ తెలిసిందే.
దీంతో చాలా మంది పుదీనాతో చట్నీలు చేసుకోవడంతో పాటు అనేక రకాల కూరల్లో కూడా వేసుకుంటుంటారు.
ఇన్నిప్రయోజనాలు దాగి ఉన్న ఈ పుదీనా ఆకును తినటానికి చాలా మంది ఇష్టం చూపరు.
ఈ మధ్యకాలంలో పుదీనా టీ అంటూ అందులో కలుపుకుని తాగుతున్నారు.
అసలు ఈ చలికాలంలో పుదీనాను తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి?
నేరుగా తినకూడని వారు ఎలా తీసుకోవాలి అనే పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పుదీనాను నేరుగా తీసుకోని వాళ్లు పుదీనాతో టీతో తీసుకోవచ్చు
పుదీనా ఆకులు తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.
మరీ ముఖ్యంగా పుదీనా టీని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడడంతో పాటు మలబద్దకం సమస్య నుంచి కూడా బయటపడొచ్చు.
ఇదే కాకుండా దగ్గు, జలుబు ఉన్నవాళ్లు సైతం ఈ పుదీనా టీని తీసుకోవడం ద్వారా తొందరగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
పుదీనా ఆకులతో తయారు చేసిన ఈ టీని తీసుకోవడం ద్వారా శ్వాసకోస సంబంధమైన వ్యాధుల నుంచి సైతం బయటపడొచ్చట.
ఇక ఇదే కాదండయో.. పుదీనా ఆకులను తినడం వల్ల మన దంతలు కూడా బలంగా తయారవుతాయట.
వీటితో పాటు మానసిక ప్రశాంతత, రోగనిరోధక శక్తి, ఒత్తిడి వంటి వాటి నుంచి పూర్తిగా బయటపడాలంటే రోజు రెండు సార్లైన పుదీనా టీని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ చిట్కాలు పాటించే ముందు నిపుణులు లేదా వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.