మన వంట ఇంట్లో ఉండే పొపుల పెట్టెనే ఓ వైద్యశాల అని కరోనా ముందు వరకు మనలో చాలా మందికి తెలియదు.

మనం రుచి కోసం వాడే రాకరకాల మసాలాల వల్ల.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో అందరికి తెలిసి వచ్చింది.

ఇక మన వంటింట్లో ఉండే అద్భుతమైన ఔషధ దినుసుల్లో మిరియాలు ఒకటి.

కూరల్లో కాస్త ఘాటు పెంచాలంటే.. కొన్ని మిరియాలు వాడితే చాలు. పైగా వీటిని సుగంధ ద్రవ్యాల రాణి అని పిలుస్తారు

ఇక జలుబు, దగ్గుతో బాధపడేవారికి మిరియాలు చేసే మేలు అంతా ఇంతా కాదు.

ఇలా మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలకు మిరియాలతో చెక్‌ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు.

మిరియాల్లో కాల్షియం, ఐర‌న్, మాంగ‌నీస్, పొటాషియం వంటి ఖనిజాలతో పాటు.. విట‌మిన్ సి, ఫైబ‌ర్ వంటి పోష‌కాలు కూడా పుష్కలంగా  ఉంటాయి.

ఇక జ‌లుబుతో బాధ‌ప‌డే వారు మ‌రిగించిన నీటిలో మిరియాల పొడి వేసి ఆవిరి ప‌డితే త్వరగా ఉపశమనం లభిస్తుంది అంటున్నారు నిపుణులు.

పాలల్లో మిరియాల పొడిని క‌లుపుకుని తాగితే.. గొంతునొప్పి, త‌ల‌నొప్పి, జ‌లుబు వంటి అనారోగ్యాల నుంచి త్వరగా కోలుకోవచ్చు.

అంతేకాక మిరియాల పొడి, శొంఠి పొడి, తేనెను క‌లిపి తరచుగా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు రావు.

చిగుళ్ల సమస్యతో బాధపడేవారు అంటే.. చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి ర‌క్తం కార‌డం వంటి వాటితో ఇబ్బంది పడేవారికి మిరియాలు దివ్య ఔషధం.

వీరు.. ఉప్పు, మిరియాల పొడిని క‌లిపి చిగుళ్ల‌కు ప‌ట్టించాలి. త‌రువాత వేడి నీటితో పుక్కిలించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల స‌మ‌స్య త‌గ్గి చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

ఇక అధిక బ‌రువుతో బాధపడుతున్న వారికి మిరియాలు ఎంతో మేలు చేస్తాయి.

వీరు భోజ‌నానికి అర‌గంట ముందు మిరియాల పొడి, తేనె క‌లిపి తీసుకోవాలి. త‌రువాత వేడి నీటిని తాగాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల చాలా త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతార‌ని నిపుణులు చెబుతున్నారు.

అలానే కీళ్లనొప్పులతో బాధపడేవారు.. బాదంప‌ప్పుతో మిరియాల పొడిని క‌లిపి తీసుకోవ‌డం సమస్య తగ్గుతుంది.

ఇక మిరియాల పొడికి ఉప్పు క‌లిపి పళ్లు తోముకోవడం వల్ల.. దంతాల స‌మ‌స్య‌లు తొల‌గిపోవ‌డ‌మే కాకుండా నోటి దుర్వాస‌న కూడా త‌గ్గుతుంది.

మొటిమల సమస్యతో బాధపడేవారు.. మిరియాల పొడి, పసుపును పేస్ట్‌గా చేసి రాసుకోవ‌డం వ‌ల్ల సమస్య తగ్గుతుంది.

అలానే గ్యాస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు.. గ్లాస్ మ‌జ్జిగ‌లో పావు టీ స్పూన్ మిరియాల పొడి క‌లిపి తీసుకుంటే వెంటనే ఫలితం కనిపిస్తుంది.

అయితే క‌డుపులో మంట‌, శ‌రీరంలో అధిక వేడి ఉన్న వారు మాత్రం మిరియాల‌ను తీసుకోక‌పోవ‌డ‌మే మంచిద‌ంటున్నారు నిపుణులు సూచిస్తున్నారు.