పూర్వం మ‌న పెద్దలు అన్నం వండిన గంజి నీటిని పార‌బోయకుండా తాగేవారు.

అయితే ప్రస్తుతం చాలా మంది గంజి నీటిని పారబోస్తున్నారు.

మనం వృథగా పారబోసే ఈ గంజిలో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. 

గంజి నీళ్లు గోరు వెచ్చగా ఉన్నప్పుడు కాస్త ఉప్పు వేసి బాగా క‌లిపి తాగాలి.

ఉద‌యం బ్రేక్‌ ఫాస్ట్ చేయాల్సిన ప‌నిలేకుండా ఈ గంజిని తాగ‌వ‌చ్చు.

లేదా బ్రేక్‌ఫాస్ట్ చేసిన త‌రువాత టీ, కాఫీల‌కు బ‌దులుగా కూడా దీన్ని తాగ‌వ‌చ్చు. 

దీన్ని ముఖ్యంగా చ‌లికాలంలో క‌చ్చితంగా తీసుకోవాలి. 

గంజి వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గంజిని తాగితే శరీర ఉష్ణోగ్రత నియంత్రణ‌లో ఉంటుంది.

గంజిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరం వెచ్చగా ఉండ‌డంతోపాటు వైర‌స్‌లు, బాక్టీరియాలు కూడా న‌శిస్తాయి. 

గంజిని తాగడం వలన జ్వరం త్వర‌గా త‌గ్గుతుంది. 

చలికాలంలో మ‌న చ‌ర్మం బాగా ప‌గులుతుంది. కానీ గంజిని తాగితే చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది.

గంజి తాగడం వలన చ‌ర్మం ప‌గ‌ల‌కుండా చూసుకోవ‌చ్చు. 

గంజిని తాగడం వలన ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి.

రోజంతా బాగా ప‌నిచేసే వారు, వ్యాయామం చేసేవారు గంజిని తాగితే త్వర‌గా శ‌క్తిని పుంజుకోవ‌చ్చు. 

గంజిని చిన్నారులు, గ‌ర్భిణీలు, వృద్ధులు ఎవ‌రైనా స‌రే తాగ‌వ‌చ్చు.

చిన్నారుల‌కు గంజిని తాగిస్తుంటే వారిలో ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది

క‌నుక గంజిని పాయబోయకుండా రోజూ ఒక గ్లాస్ చొప్పున తాగితే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు.