ప్రకృతి అందించిన సహజసిద్ధమైన , అద్భుతమైన ఎనర్జీ డ్రింక్ కొబ్బరి నీళ్లు.
కొబ్బరి నీళ్లు తాగితే ఎంత ఆరోగ్యమో అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు చెబుతారు.
ఏ చిన్న అనారోగ్యం చేసినా, లేదా ఇంటికి చుట్టాలొచ్చినా అప్పటికప్పుడు చెట్టెక్కి కొట్టిన తాజా కొబ్బరి నీళ్లు ఇచ్చి మర్యాదలు చేస్తారు పల్లెటూర్లలో.
ఇప్పుడు ఆరోగ్యం కోసం, మర్యాద కోసం పల్లెటూర్లు వెళ్ళక్కర్లేదు కానీ సిటీల్లో ఎక్కడబడితే అక్కడ కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు. కాబట్టి కొబ్బరి నీళ్లు తాగితే చాలా మంచిది.
మరి ఆ మంచి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా?
కొబ్బరి నీళ్లు రోజూ తాగితే.. చాలా వరకూ అనారోగ్య సమస్యలను తరిమికొట్టవచ్చునని అధ్యయనాలు చెబుతున్నాయి.
కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో నీటి కొరత అనేది ఉండదు. బాడీ ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్ గా ఉంటుంది.
కొబ్బరి నీళ్లతో ఊబకాయ, మధుమేహం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారు.
కొబ్బరి నీళ్లు కడుపు చుట్టూ పేరుకుపోయి ఉన్న కొవ్వుని కరిగిస్తుంది. రోజూ ఈ కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో సానుకూల మార్పులు చూడవచ్చు.
ఊబకాయం ముదిరితే.. గుండెపోటు, మధుమేహం వంటి ప్రమాదకరమైన రోగాలు వస్తాయి.
ఇలాంటి ప్రమాదాలు జరక్కుండా ఉండాలంటే కొబ్బరి నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు.
అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు కొబ్బరి నీళ్లు తాగితే సమస్య తగ్గుతుంది. కొబ్బరి నీళ్లు రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ని తగ్గిస్తాయి.
దీని వల్ల కొవ్వు తగ్గి.. రక్తపోటు స్థాయి కంట్రోల్ లో ఉంటుంది. ఇందుకే హైబీపీ ఉన్నవాళ్లను కొబ్బరి నీళ్లు తాగమనేది.
గుండెపోటు, కరోనరీ ఆర్టరీ డిసీస్, ట్రిపుల్ వెసల్ డిసీస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే శక్తి కొబ్బరి నీళ్ళకి ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే హార్ట్ పేషెంట్లు రోజూ కొబ్బరి నీళ్లు తాగాలి.
కొబ్బరి నీళ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో అంటువ్యాధులు, ఇతర రోగాలు సోకకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
గమనిక: అనారోగ్య సమస్యలు ఎక్కువైతే.. కొబ్బరి నీళ్ల మీదే పూర్తిగా ఆధారపడకుండా.. వైద్యులను కూడా సంప్రదించవల్సిందిగా మనవి.