మనకి వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం మన వంటగదిలోనే దొరుకుతుంది.

మారుతున్న ఆహారపు అలవాట్ల వల్లే ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

అయితే అల్లం, నిమ్మకాయతో పరగడుపున ఇలా చేశారంటే ఎన్నో లాభాలు ఉన్నాయి.

అల్లంలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అల్లంతో వైద్యం కూడా చేయవచ్చు.

రక్తాన్ని శుద్ధిచేయడమే కాకుండా.. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నిలువరిస్తుంది.

కొన్ని వారాలపాటు తరచూ అల్లం వాడటం వల్ల కీళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉంది.

నోటి దుర్వాసనను దూరం చేయడం, నోటి సంబంధిత వ్యాధుల నివారణకు అల్లం ఉపయోగపడుతుంది.

రక్తంలోని చక్కెరను కండరాలకు చేర్చడంలో అల్లం కీలకంగా పనిచేస్తుంది.

నిమ్మకాయ వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే అల్లం- నిమ్మకాయని వేరు వేరుగా తీసుకోవడం కంటే కలిపి తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.

అల్లాన్ని కచ్చాపచ్చాగా దంచి నీటిలో వేసి మరిగించాలి.

ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి.. దానిలోకాస్త నిమ్మరసం కలపాలి.

ఇలా రోజూ తీసుకోవడం వల్ల ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.

దగ్గుతో బాధపడేవారు ఈ పానియం తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

అంతేకాకుండా అల్లం- నిమ్మకాయ మిశ్రమంతో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.