మామూలు రోజుల్లోనే ఉదయాన్నే లేవాలంటే బద్దకంగా ఉంటుంది. ఇక చలికాలంలో లేవాలంటే రక్తకన్నీరే చాలా మందికి.
అయితే అంతటి చలిలో కూడా ఉదయాన్నే లేచేవారు ఉంటారు. అలాంటి వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు.
ఏ సీజన్ లో అయినా ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్య నిద్ర లేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది.
ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం వల్ల ఎక్కువ సమయం ఉంటుంది.
యోగా చేయచ్చు, పుస్తకాలు చదవచ్చు, సంగీతం వినవచ్చు, ఎండలో కాసేపు కూర్చుని పొద్దున్నే వచ్చే సూర్యరశ్మిని ఆస్వాదించవచ్చు.
ఉదయాన్నే లేచి యోగా చేస్తే ఆరోగ్యానికి మంచిది. షటిల్, వాలీబాల్, బాస్కెట్ బాల్, క్రికెట్ లాంటి ఆటలు ఆడితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం వల్ల రోజంతా ఉల్లాసంగా, శక్తివంతంగా ఉంటారు.
ఉదయాన్నే లేచి పరగడుపున వ్యాయామం చేస్తే శరీర అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది.
శరీరంలో క్యాలరీలు చాలా వరకూ తగ్గిపోతాయి. అధిక బరువు, ఊబకాయ సమస్యలు దూరమవుతాయి.
బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే లేచి వ్యాయామం చేసి.. వెయిట్ లాస్ డిటాక్స్ డ్రింక్ తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ప్రోటీన్లు ఎక్కువగా ఉండే అల్పాహారం తింటే బరువు సులభంగా తగ్గించుకోవచ్చు.
ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం వల్ల ఒత్తిడి ఉండదు. పనులు వేగంగా చేసుకోగలుగుతారు. ఉదయాన్నే నిద్ర లేచే వారి ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి.
పాఠశాలలకు, కళాశాలలకు, కార్యాలయాలకు వెళ్లేవారు తొందరగా నిద్ర లేస్తే పని తీరు మెరుగ్గా ఉంటుంది.
మిగిలిన వారితో పోలిస్తే.. ఉదయాన్నే త్వరగా మేల్కొనేవారు ఉత్తేజంగా, చురుగ్గా పని చేస్తారు.
గొప్ప గొప్ప వ్యక్తులంతా ఉదయాన్నే నిద్ర లేస్తారు. రాత్రి ఎంత ఆలస్యంగా పడుకున్నా ఉదయాన్నే లేస్తారు.
రాత్రి ఆలస్యంగా చాలా మంది పడుకుంటారు. కానీ ఉదయాన్నే నిద్ర లేచేవారికే ఒక రేంజ్ ఉంటుంది. కాబట్టి ఉదయం 6 గంటలకు లేచే ప్రయత్నం చేయండి. బాగుంటుంది.