మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా.. చాలా మంది మందుబాబులు ఈ విషయంలో వెనక్కి తగ్గరు

వీకెండ్ వచ్చే సరికి పార్టీలు, పబ్బులు అంటూ ఎంజాయ్ చేస్తుంటారు. 

సరదా మూడ్ లో మద్యం ఎక్కువగా తీసుకుంటే.. మరుసటి రోజుకి హ్యాంగోవర్ తప్పదు. 

నిజానికి అసలు మద్యం తీసుకోవడం పూర్తిగా మానేస్తేనే మంచిది.

అది సాధ్యం కాని వారు.. కనీసం హ్యాంగోవర్ నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

హ్యాంగోవర్ ని తగ్గించడంలో అల్పాహరం సహాయపడుతుంది. కాబట్టి.. సిట్టింగ్ మరుసటి రోజు లంచ్ అస్సలు స్కిప్ కాకుండా చూసుకోండి. 

హ్యాంగోవర్ నుండి బయటపడటానికి  అరటిపండు, పీనట్స్ బట్టర్ తో బ్రెడ్ తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

హ్యాంగోవర్ ఉన్నప్పుడు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగాలి. నిమ్మరసం వికారం, వాంతులు తగ్గుతాయి.

హ్యాంగోవర్ సమయంలో టీ, కాఫీలు తీసుకోవడం ద్వారా వీటిలో ఉండే కెఫిన్ శరీరాన్ని అప్రమత్తం చేస్తుంది. శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. 

పెరుగు తీసుకోవడం వల్ల కూడా హ్యాంగోవర్ నుండి ఉపశమనం పొందవచ్చు. 

ఇక హ్యాంగోవర్ నుండి బయటపడాలంటే మజిగ్గని మించిన రెమెడీ ఇంకోటి లేదు

అదేవిధంగా అల్లం కూడా యాంటీ ఆక్సిడెంట్ మాదిరిగా పని చేస్తుంది. 

అల్లం టీ తాగడం వల్ల డయేరియా, వికారం, వాంతులు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.

 స్పోర్ట్స్ డ్రింక్స్ తీసుకోవడం ద్వారా కూడా హ్యాంగోవర్ ని తగ్గించుకోవచ్చు. వీటిలో ఎలక్ట్రోలైట్స్ చాలా ఉంటాయి.

వాస్తవానికి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో ఉప్పు, పొటాషియంల పరిమాణం తగ్గుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా  జాగ్రత్తగా ఉండాలి. 

లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. హ్యాంగోవర్ నుండి బయటపడాలి అంటే కాస్త విశ్రాంతి తప్పక అవసరం. ఆ సమయంలో నిద్రపోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.