సాధారణంగా సినీ ఇండస్ట్రీలో లవ్ అఫైర్స్, డేటింగ్స్, ప్రేమలు, పెళ్లిళ్లు చాలా కామన్.
ఇక కొన్ని రోజులు కలిసి తిరిగిన జంటలు అభిప్రాయ భేదాలు రావడంతో తమ బంధానికి బ్రేకప్ చెబుతుంటారు.
ఇలా బ్రేకప్ చెప్పుకున్నాక కొంత మంది ఆరోపణలు చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి ఆరోపణలే చేసింది బాలీవుడ్ బ్యూటీ.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తనను లైంగికంగా వేధించాడని, సిగరెట్లతో కాల్చాడని ఆరోపణలు చేసింది.
ఏడేళ్లు సల్మాన్ తో అఫైర్ నడిపిన ఈ ముద్దుగుమ్మ తాజాగా సల్మాన్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బీ టౌన్ లో సంచలనం రేపుతున్నాయి.
సల్మాన్ ఖాన్.. బాలీవుడ్ కండల వీరుడిగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా గుర్తింపు పొందాడు.
అయితే సల్మాన్ ఎప్పుడూ.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటాడు. తాజాగా గతంలో ఓ హీరోయిన్ తో నడిపిన ఎఫైర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
90ల్లో సల్మాన్ నటి సోమీ అలీతో ప్రేమ వ్యవహారం నడిపాడు. అప్పట్లో ఈ విషయం బాలీవుడ్ అంతటా ఓ హాట్ టాపిక్ గా మారింది.
దాంతో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు అని అప్పట్లో భారీ ప్రచారమే జరిగింది. కానీ వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఇద్దరు తమ రిలేషన్ కు బ్రేకప్ చెప్పుకున్నారు.
అప్పటి నుంచి సోమీ అలీ ఇండస్ట్రీకి దూరం అయ్యింది.
ఈ క్రమంలోనే సోమీ అలీ పరిశ్రమ వదిలి వెళ్లడానికి సల్మానే కారణం అని అప్పట్లో వార్తలు సైతం వచ్చాయి.
తాజాగా సల్మాన్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు చేసింది ఈ భామ. సల్మాన్ తో రిలేషన్ లో ఉన్నప్పుడు తనను తీవ్రంగా కొట్టేవాడని, పైగా సిగరెట్లతో కాల్చేవాడని ఆరోపణలు చేసింది.
అదీ కాక సల్మాన్ ఓ ఉన్మాది అని, ఉమన్ బీటర్ అంటూ మండిపడింది. అతడు అనల్ సెక్స్ చేయమని తనను వేధించేవాడని సోమీ అలీ తీవ్రమైన ఆరోపణలు చేసింది.
స్త్రీలను కొట్టడం అతడికి అలవాటని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశగా మారాయి.