సాధారణంగా చలికాలంలో పలు రకాల పండ్లు, కూరగాయలు ఎక్కువగా దొరుకుతాయి. రోజూ వీటిని తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ప్రధానంగా ఈ సీజన్ లో పచ్చి బఠానీలు మార్కెట్ లో పుష్కలంగా దొరుకుతాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
పచ్చి బఠానీల్లో ప్రొటీన్, విటమిన్ సీ, బీ6, ఐరన్, పొటాషియం ఉంటాయి.
వీటిని కూరగా చేసుకొని చపాతీల్లో, అన్నంలో కూడా తినొచ్చు.
వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ మటర్ తినాలని సూచిస్తున్నారు.
ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతాయి. రెగ్యులర్ గా తింటే ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందొచ్చు.
పచ్చి బఠానీల్లో సెలీనియం మూలకం ఉంటుంది. ఇది ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
వీటిని రోజూ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి.
ఇందులోని యాంటీ యాక్సిడెంట్స్ శరీరాన్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి.
పచ్చి బఠానీలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. పొట్ట సమస్యలను తొలగించడంలో సహాయపడుతాయి.
ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్.. పొట్టను ఆరోగ్యానికి సహాయపడుతుంది. వీటిని రోజూ తింటే అజీర్తి సమస్య ఉండదు.
నోట్: పైన టిప్స్ ఫాలో అయ్యేముందు డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.