టాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్.

ఇప్పుడు తనకు ఫేమ్ తెచ్చిన క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో 'హిట్ 2' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

హీరో నాని ప్రొడ్యూస్ చేసిన 'హిట్' మూవీకి సీక్వెల్ గా.. హిట్ 2 రూపొందించాడు డైరెక్టర్ శైలేష్ కొలను. 

హిట్ కి సీక్వెల్ గా వచ్చిన హిట్ 2 ఎలా ఉంది? హీరోగా అడివి శేష్ కి, ప్రొడ్యూసర్ గా నానికి ఎలాంటి ఫలితాన్ని అందించిందో రివ్యూలో చూద్దాం!

కథ: కృష్ణ దేవ్(అడివి శేష్) వైజాగ్ లో చాలా కూల్ పోలీస్ ఆఫీసర్.. క్రిమినల్ కేసులను చాలా ఈజీగా సాల్వ్ చేస్తుంటాడు.

సంజన అనే అమ్మాయి మర్డర్ కేస్ షాక్ కి గురిచేస్తుంది. దీంతో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా.. 

సంజన డెడ్ బాడీకి సంబంధించి కృష్ణ దేవ్ కి ఊహించని నిజాలు తెలుస్తాయి.

సంజనని అతి కిరాతకంగా చంపిన ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? సంజన కేస్ లో కృష్ణ దేవ్ ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నాడు? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ: టాలీవుడ్ లో ఎక్కువగా థ్రిల్లర్ టైప్ సినిమాలు చేసే హీరో అడివి శేష్. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్ 2 చేసేసరికి ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి.

వైజాగ్ ఎస్పీ కృష్ణదేవ్(అడివి శేష్) క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ సినిమా మొదలవుతుంది.

చాలా కూల్ గా ఎలాంటి కేసులైనా ఈజీగా సాల్వ్ చేసేస్తాడని చెబుతూ.. హీరో క్యారెక్టరైజేషన్ ని ఇంట్రడ్యూస్ చేశాడు దర్శకుడు.

కృష్ణదేవ్ ప్రేయసి ఆధ్యగా మీనాక్షి చౌదరి ఎంతో చక్కగా ఆకట్టుకుంది.

ప్రారంభం స్లోగానే అయినప్పటికీ.. సినిమా ముందుకు వెళ్తున్నాకొద్దీ స్క్రీన్ ప్లేలో వేగం పెరుగుతూ పోయింది. 

మొదటి పది నిముషాలకే సంజన డెడ్ బాడీతో షాకిచ్చిన డైరెక్టర్.. ఒక్కో పాయింట్ ని చాలా థ్రిల్లింగ్ గా అల్లుకుంటూ సస్పెన్స్ మెయింటైన్ చేశాడు.

బట్ థ్రిల్లర్స్ లో ఎక్కువగా కనిపించే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఇందులో కూడా మేజర్ పార్ట్ ఉంటుంది.

సో.. డైరెక్టర్ స్క్రీన్ ప్లేని ఎంగేజింగ్ గా రాసుకోవడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

సెకండాఫ్ లో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ.. ఈ స్క్రిప్ట్ లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నట్లు అనిపిస్తుంది.

ప్లస్ లు:  అడివి శేష్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ట్విస్టులు

మైనస్ లు: ఇన్ కంప్లీట్ ఎమోషన్స్,  రొటీన్ స్టోరీ లైన్

చివరిమాట: హిట్ 2.. ట్విస్టులతో థ్రిల్ చేస్తుంది!

రేటింగ్: 3/5