పసికూన జింబాంబ్వేకి అండగా.. అప్పట్లో ఓ సింహం ఉండేది! అతనే ఆండీ ఫ్లవర్!
ప్రపంచంలోని ఛాంపియన్ టీమ్స్‌లో ఉండే దిగ్గజ ఆటగాళ్లను తలదన్నుతూ.. తన బ్యాటింగ్ పవర్‌తో జింబాబ్వే పసికూన జట్టే అయినా..
వళ్లు దగ్గరపెట్టుకుని ఆడాలనే విధంగా ప్రత్యర్థులను భయపెట్టాడు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్, పాకిస్థాన్, ఇంగ్లండ్.. చివరికి భారత బౌలర్లకు సైతం చుక్కలు చూపించాడు..
అతనే ఆండీ ఫ్లవర్. పాతతరం క్రికెట్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే లెజెండరీ క్రికెటర్. ఇప్పుడు అతని గురించి తెలుసుకుందాం..
సౌతాఫ్రికా సంతతికి చెందిన ఆండీ.. 1992 ఫిబ్రవరీలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.
ఆ వెంటనే కొన్ని నెలల్లోనే ఇండియాతో మ్యాచ్‌లో టెస్టు క్రికెట్లోకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. జట్టు పరంగా జింబాబ్వే పసికూన జట్టుగా పిలువబడుతున్నా..
ఆండీ ఫ్లవర్ మాత్రం అద్భుతమైన ఆటగాడిగా ఎదిగాడు. ప్రపంచ మేటి జట్లపై తన తిరుగులేని బ్యాటింగ్ స్కిల్స్‌తో పరుగుల వరద పారించాడు.
భారత్‌తో ఆడిన తొలి టెస్టులోనే హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అక్కడి నుంచి.. జింబాబ్వే క్రికెట్లో ఒక తిరుగులేని ఆటగాడిగా మారిపోయాడు.
ఫార్మాట్ ఏదైనా.. ఏ దేశంలో ఆడినా.. ఎలాంటి బౌలర్లను ఎందుర్కొన్నా.. ఫ్లవర్ మంచి ప్రదర్శనలు చేశాడు. జింబాబ్వేను ఓడించాలంటే ఆండీ ఫ్లవర్‌ను ఓడించాలనే విధంగా..
2000వ సంవత్సరంలో ఆండీ ఫ్లవర్ కెరీర్ పీక్ ఫామ్‌లో కొనసాగాడు. టీమిండియాపై నాగ్‌పూర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు.
అంతకు ముందు ఢిల్లీలో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 183(నాటౌట్), రెండో ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేసి దుమ్మురేపాడు.
నాగ్‌పూర్‌లో తొలి ఇన్నింగ్స్‌లోనూ 55 పరుగులతో రాణించాడు. ఇలా టీమిండియాపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించాడు. శ్రీనాథ్, అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్ లాంటి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
టెస్టుల్లో ఒక వికెట్ కీపర్‌గా అత్యధిక పరుగులు 232 రికార్డు సైతం ఆండీ పేరునే ఉంది. ఆండీ ఫ్లవర్‌ను అవుట్ చేసేందుకు టీమిండియా బౌలర్లతో పాటు ప్రపంచ మేటి బౌలర్లు సైతం తలలుపట్టుకునే వారు.
అలాగే వన్డేల్లోనూ ఆండీ అద్బుతంగా ఆడేవాడు. తన వన్డే కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 145 కూడా ఇండియాపైనే బాదాడు.
2002లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా కోలంబోలో జరిగిన మ్యాచ్‌లో ఆండీ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 164 బంతుల్లో 13 ఫోర్ల 145 పరుగులు చేసి, విజయం కోసం ఒంటరి పోరాటం చేశాడు.
కానీ.. మిగతా బ్యాటర్లు సహకరించకపోవడంతో.. జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. కానీ.. ఆండీ ఫ్లవర్ పోరాటంపై మాత్రం సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది.
11 ఏళ్ల పాటు కెరీర్‌ను అద్భుతంగా కొనసాగించిన ఆండీ.. జింబాబ్వే జట్టుకు సైతం తన హాయంలో స్వర్ణయుగం అందించాడు.
ఆ తర్వాత 2002-03 మధ్య కాలంలో జింబాబ్వే బోర్డుకు ఆటగాళ్లకు మధ్య చెలరేగిన వివాదాలతో ఆండీ ఫ్లవర్ తన కెరీర్‌కు ముగింపుపలకాల్సి వచ్చింది. కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ఆండీ..
ఇప్పటికైనా.. ఆండీ ఫ్లవర్ ఒక లెజెండరీ క్రికెటర్. కానీ.. పెద్ద జట్లకు ఆడి ఉంటే.. మరింత పేరు, ప్రఖ్యాతలు దక్కేవి.
అయినా.. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి జట్లకు లభించే సౌకర్యాల్లో సగం కూడా అందని జింబాబ్వే నుంచే ఆండీ ఫ్లవర్ అలా ఆడితే.
ప్రస్తుతం బీసీసీఐ ఆటగాళ్లను పువ్వులో పెట్టుకుని చూసుకున్నట్లు ఆండీని చూసుకుని ఉంటే.. ఇంకెన్ని అద్భుతాలు సృష్టించే వాడో కదా.