దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం జోరందుకుంది. ఇంధన ధరలు ప్రియం కావడంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు ద్రుష్టి సారించారు.
ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ప్రముఖ EV స్టార్టప్ కంపెనీ 'అల్ట్రావయోలెట్' ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైకులను లాంచ్ చేసింది.
F77, రీకాన్, ఎఫ్ 77 లిమిటెడ్ స్పెషల్ ఎడిషన్.. ఇలా మూడు వేరియంట్లను ఇంట్రడ్యూస్ చేసింది. ఇవి బైక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.
F77, రీకాన్, ఎఫ్ 77 లిమిటెడ్ స్పెషల్ ఎడిషన్.. ఇలా మూడు వేరియంట్లను ఇంట్రడ్యూస్ చేసింది. ఇవి బైక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.
అల్ట్రావయోలెట్ ఎఫ్77: లాంచ్ చేసిన మూడు వేరియంట్లలో ఇది బేస్ మోడల్. దీని ధర రూ.3.80 లక్షలు (ఎక్స్-షోరూమ్).
ఈ ఎలక్ట్రిక్ బైక్ 27-kW ఎలక్ట్రిక్ మోటార్, IP67-రేటెడ్ 7.1 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.
దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 206 కి.మీలు ప్రయాణించవచ్చు. ఈ బైక్ కేవలం 8.3 సెకన్లలో 0-100 కిమీ వేగాన్ని అందుకుంటుంది.
కలర్ ఆప్సన్ విషయానికి వస్తే.. బ్లాక్, సిల్వర్ మరియు రెడ్ కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.
అల్ట్రావయోలెట్ F77 రీకాన్: దీని ధర రూ.4.55 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది బేస్ వేరియంట్‌తో పోలిస్తే మెరుగైన పనితీరును కనబరుస్తుంది.
ఈ బైక్ ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 307 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఇందులో 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అందించారు.
ఈ బైక్ కేవలం 3.1 సెకన్లలో గంటకు 60 కిమీ వేగాన్ని మరియు 8 సెకన్లలో 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది.
ఇది బేస్ మోడల్ లాగానే బ్లాక్, సిల్వర్ మరియు రెడ్ కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.
అల్ట్రావయోలెట్ ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్: ఇది చివరి మోడల్. దీని పేరుకి తగిననట్లుగానే కేవలం 77 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు.
అంటే ఈ ఎలక్ట్రిక్ బైక్ కేవలం 77 మంచి కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది.
దీని ధర రూ. 5.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని పనితీరు ముంద చెప్పిన రెండు బైకులంటే కూడా అద్భుతంగా ఉంటుంది.
ఇందులో 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అందించారు. సింగిల్ ఛార్జ్ తో 307 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది.
ఇది కేవలం 7.8 సెకన్లలో 0-100 కిమీ వేగాన్ని అందుకుంటుంది.
ఆసక్తికలిగిన కొనుగోలుదారులు రూ. 10,000 చెల్లించి కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లో బుక్ చేసుకోవచ్చు.