మనం ఆరోగ్యానికి కాపాడుకునేందుకు అనేక రకాల మూలికలను ఉపయోగిస్తుంటాము.
ఆరోగ్యానికి కాపాడే మూలికల్లో కర్పూరం ఆకులు కూడా ప్రధానమైనవి.
ఆ కర్పూరం ఆకులను వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.
కర్పూరం ఆకులతో రసాన్ని సేకరించి..దాని సేవిస్తే అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.
ముఖ్యంగా జలుబు,దగ్గు, జ్వరం వంటివి ఉన్నప్పుడు ఈ కర్పూర ఆకుల రసాన్ని సేవించాలి.
బ్యాక్టీరియాల కారణంగా మన చర్మంపై దురదలు, దద్దుర్లు, గజ్జి వంటి వ్యాధులు వస్తాయి.
వీటి నుంచి చర్మాన్ని కాపాడేందుకు.. కర్పూరం ఆకులను ఉపయోగించాలి.
చర్మంపై ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రాంతంలో ఈ ఆకుల్ని కాల్చి అద్దితే.. సమస్య పరిష్కారం అవుతుందట.
కీళ్లలో వచ్చే ఆకస్మిక నొప్పి, వాపు సమస్యలకు కర్పూరం ఆకులు ఔషధంగా పనిచేస్తాయి.
ఈ ఆకులో ఒమేగా-6లు పుష్కలంగా ఉండి..మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
కర్పూరం ఆకుల్ని తింటే క్యాన్సర్ కారకాలను సమర్ధవంతాగా ఎదుర్కొంటాయి.
కర్పూరం ఆకుల్లోని రసాయన పదార్ధలు నాడీ వ్యవస్థను ఒత్తిడి లేకుండా ఉంచుతాయి.
ఈ ఆకుల ద్వారా ఒత్తిడి, ఆందోళన నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది.
కర్పూరం ఆకుల్ని నుంచి రసాన్ని సేకరించి రోజూ తాగితే కిడ్నీలో సమస్యలు తొలగిపోతాయి.
కిడ్నీలోని ఉప్పు నిల్వలు కరిగిపోవడంలో ఈ కర్పూరం ఆకులు తోడ్పడతాయి.
నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోండి.