చలికాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరిని వేధించే సమస్య చర్మం పగిలిపోవడం.
ఇలా చర్మం పగలకుండా ఉండటానికి మార్కెట్ లో దొరికే రకరకాల క్రీమ్ లు వాడుతుంటారు చాలా మంది.
ఇక మరికొంత మంది చలిని తట్టుకోలేక ఈ కాలం ఎండలో ఎక్కువ సేపు ఉందానికి ఇష్ట పడతారు.
అలా ఎక్కువ సేపు ఎండలో ఉంటే స్కిన్ పొడి బారటమే కాకుండా నల్లగా మారుతుంది.
చర్మం నల్లగా మారడంతో ఆందోళన చెంది.. మార్కెట్ లో దొరికే రకరకాల సన్ క్రీమ్స్ ను ఉపయోగిస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.
ఇలా క్రీమ్స్ వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంట్లో ఉండే వాటితోనే డార్క్ స్కిన్ కు చెక్ పెట్టోచ్చు అంటున్నారు నిపుణులు.
పసుపు, శనగ పిండి చర్మ సౌందర్యానికి అద్భత ఔషధంగా పనిచేస్తుంది.
కొంచెం శనిగ పిండిలో పసుపు, పాలు పోసి దాన్ని బాగా కలిపి ముఖానికి, మెడకు రాయాలి.
10-15 నిమిషాల తర్వాత నీటితో కడిగితే మీ చర్మం అందంగా మెరిసిపోతుంది.
కలబందను ఔషధాల దిట్ట అనొచ్చు. ఈ గుజ్జును చర్మానికి అప్లై చేసిన 10 నిమిషాల తర్వాత కడగాలి.
దీనిలో ఉండే బీటా కెరోటిన్ చర్మ సౌందర్యానికి అద్భతంగా ఉపయోగపడుతుంది.
బంగాళా దుంపను మిక్సి పట్టి దాని రసాన్ని.. దూది సాయంతో ముఖానికి అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో కడిగితే స్కిన్ కు ప్రయోజనం ఉంటుంది.
టమాటాల్లో చర్మానికి మంచి చేసే ఎన్నో గుణాలు పుష్కలంగా ఉంటాయి. టమాట గుజ్జును ముఖానికి రుద్దాలి. అది ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేస్తే ముఖం ఫ్రెష్ గా కనిపిస్తుంది.
నోట్: ఈ చిట్కాలు పాటించే ముందు మీకు ఏదైనా చర్మ సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించి, సలహాలు తీసుకోండి.