పలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు.. కొన్ని ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు. అలాంటి వాటిలో వేరుశనగ ఒకటి.

చెప్పాలంటే వేరుశనగ తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

వేరుశనగల్లో మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

ఖాళీ కడుపుతో పచ్చి వేరుశనగల్ని తినడం వల్ల జీర్ణ సమస్యల్ని నివారించవచ్చు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కు చెక్ పెట్టొచ్చు.

కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం.. వేరుశనగకు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చలికాలంలో రోజూ వేరుశనగ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

డయోబెటిస్ రోగులకు వేరుశనగ చాలా మేలు చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి.

వేరుశనగ తీసుకోవడం వల్ల కీళ్లనొప్పులు పెరుగుతాయి. వాపు సమస్యలు కూడా ఎక్కువయ్యే ఛాన్సుంది.

శ్వాసకోస సమస్యలు ఉన్నవాళ్లు.. వేరుశనగకు దూరంగా ఉండండి. లేదంటే జలుబు పెరిగిపోతుంది.

బీపీ ఉన్నవారు వేరుశనగకు చాలా దూరంగా ఉండాలి. కాలేయ ప్రాబమ్స్ ఉన్నాసరే దీన్ని అస్సలు తినకూడదు.

వేరుశనగ తీసుకోవడం వల్ల అప్లాటాక్సిన్ పరిమాణం పెరుగుతుంది. అప్లాటాక్సిన్ అనేది కాలేయాన్ని దెబ్బతీసే హానికరమైన పదార్థం.

కాబట్టి ఇలాంటి సమస్యలున్న వారు వేరుశనగకు దూరంగా ఉంటే బెటర్ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోండి.