డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూర్చుతాయి. అందుకే వీటిని రోజూ తినాలని డాక్టర్స్ చెబుతుంటారు.

ఎండుద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తాజా, ఆకుపచ్చ ద్రాక్ష కంటే వీటి వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇక కిస్ మిస్ ని నానబెట్టి తినడం మంచింది. నానబెట్టిన దానిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ తోపాటు పోషకాలు కూడా ఎన్నో ఉంటాయి.

ఎండుద్రాక్ష నానబెట్టి తినడం వల్ల.. పొట్టలో యాసిడ్ కంట్రోల్ చేయొచ్చు.

దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ప్రేగు పనిని ఇవి మెరుగుపరుస్తాయి.

ఎండుద్రాక్ష తినడం వల్ల గట్ బ్యాక్టీరియా తగ్గుతుంది. ఇక వీటిని నానబెట్టిన నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

కిస్ మిస్ నానబెట్టిన నీటిని తాగడం వల్ల శరీరం నుంచి విషం బయటకు పోతుంది. రక్తం కూడా శుభ్రపడుతుంది.

ఈ నీటిని ఓ వారం పాటు తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. మీ లివర్ కూడా క్లీన్ అవుతుంది. దాని పనితీరు మెరుగుపడుతుంది.

కిస్ మిస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

కిస్ మిస్ నానబెట్టి నీటిని తాగడం వల్ల జట్టు రాలడం సమస్య తగ్గుతుంది. బాడీలోని రక్త ప్రసరణ మెరుగుపడుతుంది

కాబట్టి కుదుళ్లు బలంగా తయారవుతాయి. దీంతో జట్టు రాలడం ఆగుతుంది.

కిస్ మిస్ నానబెట్టిన నీరు తాగడం వల్ల మెలటోనిన్ పెరుగుతుంది. ఇది నిద్ర రుగ్మతలని నివారించడంలో సహాయపడుతుంది.

ఈ క్రమంలోనే నిద్రలేమితో బాధపడుతున్న వారు.. ఎండుద్రాక్ష నానబెట్టిన నీరు తాగడం వల్ల రాత్రుళ్లు మీకు బాగా నిద్రపడుతుంది.

నోట్: పై టిప్స్ పాటించేముందు ఓసారి డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.