మనం చాలా కూరగాయలని భోజనంలో తీసుకుంటూ ఉంటాం.
వాటిలో బెండకాయ కూడా ఒకటి. దీన్ని పోషకాల గని అంటారు.
బెండకాయలను పులుసుగా చేస్తారు. చాలామంది మాత్రం బెండకాయల ఫ్రైని ఇష్టపడతారు.
బెండకాయలని మనం భోజనంలో తీసుకోవచ్చు. కానీ దీన్ని తిన్న తర్వాత కొన్ని పదార్థాలని అస్సలు తీసుకోకూడదు.
ఇలా తినడం వల్ల చాలా దుష్ర్పభావాలు ఉన్నాయి. ఇంతకీ అవేంటి? ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం.
బెండకాయల్లో విటమిన్ ఏ, సీ, ఫోలోట్, క్యాల్షియం సహా చాలా పోషకాలు ఉంటాయి. జీర్ణశక్తిని బెండకాయ పెంచుతుంది.
ఇకపోతే బెండకాయ తిన్న తర్వాత కాకరకాయని అస్సలు తీసుకోకూడదు. ఇవి రెండు కడుపులో కలిస్తే.. అది విషపదార్థంగా మారే ఛాన్సుంది.
మనలో చాలామందికి మిగిలిన కూరగాయాలు అన్నింటితో ఓ కూర చేయడం అలవాటు. బెండకాయతో ఇలా చేయకూడదు.
ఎందుకంటే ఒకదానితో మరొకటి కలిసే మినరల్స్ ఉండవు. దీంతో అవి విషంగా మారే ఛాన్సు ఉంది.
బెండకాయ తిన్న తర్వాత ముల్లంగిని అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ తింటే మాత్రం.. శరీరంపై తెల్లటి మచ్చలు ఏర్పడే అవకాశముంది.
అలానే ముల్లంగి తిన్న తర్వాత కూడా బెండకాయని ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు.
ఇది శరీరానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.