చలికాలంలో మనకు జలుబుతో పాటు గొంతునొప్పి లాంటి ప్రాబ్లమ్స్ కూడా వేధిస్తుంటాయి.

ఈ సీజన్ లో మార్పులు వల్ల హానికర బ్యాక్టీరియాలు, వైరస్ లు మన గొంతులో తిష్ట వేసేస్తాయి.

దీంతో గొంతు అంతా ఒకటే గరగరగా మారుతుంది. గొంతునొప్పి మూలంగా తినడం, తాగడం కూడా కష్టమవుతుంది.

ఈ క్రమంలో చలికాలంలో గొంతునొప్పి నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే 90 శాతం కేసుల్లో గొంతు సమస్యలకు వైరల్ ఇన్ఫెక్షన్లే కారణమని తెలుస్తోంది.

అలానే గొంతు నొప్పి సమస్య.. ఒకరి నుంచి మరొకరికి తేలికగా వ్యాపిస్తుంది. 

పిల్లల్లో ఇది కనిపించినప్పుడే.. తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి.

పిల్లలకు గొంతునొప్పి ఉన్నట్లయితే చలికాలంలో ఎక్కువగా బయట తిరగనివ్వకూడదు. తరుచూ వారు యూజ్ చేసే బట్టల్ని క్లీన్ చేస్తుండాలి.

గొంతు నొప్పిగా ఉన్నప్పుడు.. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువగా నీళ్లు తాగాలి.

నీరు తాగడం వల్ల గొంతులో తేమని పెంచి, మింగడాన్ని తేలిక చేస్తుంది.

గొంతునొప్పితో బాధపడేవారు.. రైస్, కర్రీ లాంటి ఫుడ్ ఐటమ్స్ కాకుండా మెత్తటి గుజ్జు లాంటి ఆహారం తీసుకోవాలి.

దీని వల్ల గొంతునొప్పి తగ్గడమే కాకుండా మింగడాన్ని కూడా తేలిక చేస్తుంది.

తరుచూ ఏదైనా చప్పరిస్తూ ఉండాలి. దీనివల్ల లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. ఇది గొంతునొప్పిని తగ్గించే సహజసిద్ధమైన పరిష్కారం.

గొంతునొప్పి ఉన్నప్పుడు కారం, మసాలాలు బాగా తగ్గించాలి. ద్రవ పదార్థాలు, సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే గొంతునొప్పి త్వరగా తగ్గుతుంది.

నోట్: పైన టిప్స్ ఫాలో అయ్యేముందు ఓసారి డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.