కానీ.. ఒక్క భారత బ్యాటర్ మాత్రం తనను సమర్థవంతంగా ఎదుర్కొనే వాడని తెలిపాడు. అతను మరెవరో కాదు.. టీమిండియా దిగ్గజ ఆటగాడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.
దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో సచిన్ టెండూల్కర్ ఎందరో బౌలర్లను ఎదుర్కొన్నాడు. సచిన్ వికెట్ తీస్తే చాలు జన్మధన్యమైనట్లే అని భావించే బౌలర్లు ఎందురో. సచిన్‌ను అవుట్ చేయడం అంటే మ్యాచ్ గెలవడం కన్నా ఎక్కువ.
కొన్ని సార్లు సచిన్‌ను అవుట్ చేయడం అటుంచి అతని చేతిలో బౌండరీలు బాదించుకోకుండా ఉంటే చాలు అనుకునే వారు. మరి అలాంటి ఆటగాడికి అక్తర్ లాంటి బౌలర్‌ను ఎదుర్కొవడం పెద్ద విషయం కాదు.
కానీ.. ఒక్క సచిన్ టెండూల్కర్ మాత్రం బౌలింగ్‌ను బాగా ఆడేవాడు. అలాగే వరల్డ్ కప్ లాంటి వేదికల్లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోవడానికి జట్టుపై ఉండే ఒత్తిడే ప్రధాన కారణం.
టీవీలు చూసి మేము కూడా మాకు తెలియకుండానే ఒత్తిడికి గురవ్వడం వల్లే మ్యాచ్ ఓడిపోయేవాళ్లు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రేజ్, హైప్, ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది.
కానీ.. వరల్డ్ కప్ లాంటి మ్యాచ్‌ల్లో మాత్రం దాన్ని మరింత పెంచేస్తారు.’ అని అక్తర్ అన్నాడు. కాగా గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాను పాకిస్థాన్ ఓడించింది.