కల్పిక సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాతో  మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తర్వాత  టాలీవుడ్‌లో చాలా మంచి సినిమాల్లో నటించారు.

సీతా ఆన్‌ రోడ్స్‌ అనే అద్భుతమైన సినిమాలో కల్పిక లీడ్‌  రోల్‌లో కనిపించి మెప్పిచారు. ఇటీవల విడుదలైన  యశోద సినిమాలో చాలా మంచి రోల్‌ చేసింది.

హీరోయిన్స్‌ కంటే అందంగా ఉంటాను, డామినేట్‌  చేస్తానని కారణాలతో నన్ను ఎక్కువగా సినిమాల్లో  నుంచి తీసేశారేమో అని కల్పిన అభిప్రాయపడుతున్నారు.

30 సినిమాల్లో నటిస్తే కేవలం 15 మాత్రమే విడుదల  అయ్యాయట. అలాగే అబ్బాయిలు, అమ్మాయిలు, లస్ట్‌  వంటి వాటి గురించి సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్య్యూలో  ఓపెన్ కామెంట్స్‌ చేశారు.

“లస్ట్‌, కామం అందరికీ ఉంటుంది. అమ్మాయిలకి కూడా  ఈ లస్ట్, కామం ఉంటాయి. కాకాపోతే దానిని ఎక్కడ  చూపించాలి అనేది తెలియాలి. 

మీ పరిధి మీకు ముందు తెలియాల్సి ఉంటుంది. సెక్సీగా ఉంది, హాట్‌గా ఉంది..

అంత వరకు చాలు. నేను కూడా యాక్సెప్ట్‌ చేస్తా..  థాంక్యూ  అని రిసీవ్‌ చేసుకుంటా.  అంతవరకు ఉంటే ఏం కాదు.

కానీ, అంతకు మించి మీరు ఏమైనా చేయాలి,  అనాలి అకుంటే ఆ స్థానంలో మీ ఇంట్లో వాళ్లని  ఊహించుకోండి.

మీ అమ్మకో, మీ చెల్లికో, అక్కతో అయితే అలాంటి  మాటలు మాట్లాడతారా? అలా చేస్తే ఎలా ఉంటుంది?  అనేది ఆలోచించుకోని మాదగ్గరకు రండి”  అంటూ వ్యాఖ్యానించారు.

“మిమ్మల్ని ఎలా పెంచుతున్నారు అనేది ముఖ్యం ఇక్కడ.  ఒకవేళ మీ ఇంట్లో మిమ్మల్ని అసలు  పెంచకపోయినా కూడా..

సమాజాన్ని చూసి మీరు ఏం నేర్చుకుంటున్నారు?  ఎలా ఉంటున్నారు అనేది కూడా ఇక్కడ పాయింట్.  అదరిలో తల్లిని చూడాలి అని కూడా అనట్లేదు.

ఎందుకంటే తల్లిని కూడా కామంతో చూసే దుర్మార్గులు  ఉన్నారు. నేను దేనిపై పోరాడటం లేదు. అసలు  ఏదైనా మార్పు తీసుకురావాలి అని అనుకోవట్లేదు.

ఏదైనా మార్పు రావాలి అంటే ముందు మనలో  మనం మార్పు కోరుకోవాలి.

తర్వాత మన చుట్టూ ఉన్న పది మందికి అర్థమయ్యే  భాషలో చెప్పి వారిలో మార్పు వచ్చేలా చేయాలి”  అంటూ కల్పిక గణేశ్‌ ఓపెన్‌ కామెంట్స్‌ చేశారు.