ఈ కాలంలో బాగా లభించే పండ్లలో సీతాఫలం ఒకటి. సూపర్ టేస్టీగా ఉండటంతో పాటు చాలా పోషకాలు దీనిలో ఉంటాయి.

సీతాఫలంలో విటమిన్ ఏ, బీ6, సీతోపాటు మెగ్నీషియం, కాపర్, పొటాషియం, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

అలానే సీతాఫలాన్ని, తేనెతో కలిపి సరైన మోతాదులో తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

సీతాఫలాన్ని రోజూ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ బయటకు పోతుంది. ఊబకాయం, అధిక బరువు సమస్యలకు చెక్ పడుతుంది.

దీనిలో మెగ్నీషియం.. కండరాలకు శక్తిని ఇవ్వడంతో పాటు ఆస్తమా, గుండెపోటు నుంచి మనల్ని కాపాడుతుంది.

సీతాఫలం తీసుకోవడం వల్ల గర్భిణులకు సుఖప్రసవం అవుతుంది. కడుపులోని బిడ్డ రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు మెదడు, నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది.

అలానే బాలింతల్లో పాల ఉత్పత్తి పెరగడంలో సీతాఫలం అమోఘంగా సహాయపడుతుంది. బిడ్డకు సరైన పోషణ అందుతుంది.

సీతాఫలంలో పీచు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. గ్యాస్, ఎసిడిటీ తదితర ప్రాబ్లమ్ తొలగిపోతాయి.

వయసు పైబడిన వారికి.. మోకాళ్లు, కీళ్లు సంబంధిత సమస్యలు బాధిస్తుంటాయి.

ఇలాంటి వాళ్లు సీతాఫలం తినడం వల్ల జాయింట్స్ దగ్గర ఏర్పడే యాసిడ్స్ ని తగ్గుతాయి. తద్వారా కీళ్ల సమస్యలు రావడం తగ్గుతుంది.

బీపీని కంట్రోల్లో ఉండటంలో సీతాఫలం బాగా పనిచేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ నుంచి కూడా రక్షిస్తుంది.

జుట్టు పెరుగుదలలో కూడా సీతాఫలం తనదైన పాత్ర పోషిస్తుంది. దీనిలోని విటమిన్ ఏ వల్ల చర్మం గ్లోయింగ్ పెరుగుతుంది.

సీతాఫలం తీసుకోవడం వల్ల అందులోని విటమిన్ ఏ.. మీ దృష్టి లోపాల్ని సవరిస్తుంది. దీంతో కంటిచూపు మెరుగుపడుతుంది.

పురుషుల్లో నరాల వీక్ నెస్ ఎక్కువగా ఉంటుంది. సీతాఫలం తినడం వల్ల కంట్రోల్లో ఉంటుంది.

పురుషులు.. ప్రతిరోజూ ఉదయాన్నే సీతాఫలం తినడం వల్ల నరాల బలహీనతని దూరం చేసుకోవచ్చు.