కలబందను చర్మ సంబంధిత సౌందర్య సాధనాల తయారీకి, ఫేస్ క్రీములు, బాడీ లోషన్స్, హెయిర్ జెల్ లు వంటి వాటిలో ఎక్కువగా వాడుతుంటారు.
ముఖానికి ఈ కలబంద గుజ్జు రాసుకోవడం వల్ల మొటిమలు తొలగిపోయి.. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
అయితే కలబంద బాహ్య సౌందర్యానికి మాత్రమే కాదు.. శరీర ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.
దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కలబందతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కలబందను ఆయుర్వేద వంటకాలు, టానిక్ లలో కూడా వాడతారు.
డైలీ ఉదయం ఖాళీ కడుపులో కలబంద గ్లాసు రసం తాగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇది గట్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇందులో ఉండే ఎసిమానన్, గ్లూకోమానన్, అక్సెమనోస్, విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ సిలు గట్ ను రక్షించడంలో తోడ్పడతాయి.
కలబంద రసం తాగితే.. మలబద్ధకం తగ్గుతుంది. జీర్ణసమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.
కలబంద రసం తాగితే శరీరంలో ఉండే వ్యర్థపదార్థాలు బయటకు వచ్చేస్తాయి.
బరువు తగ్గాలనుకునేవారు ఈ కలబంద రసం తాగితే బరువు తగ్గుతారు. కలబంద శరీరంలో మంటను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
రోజూ రెండు టేబుల్ స్పూన్ల కలబంద రసం తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రోగుల రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
కలబంద కొమ్మని తీసుకుని.. దానిలో పైన ఉండే తొక్కని వదిలేసి.. లోపల ఉన్న గుజ్జుని ఒక గిన్నెలో వేయండి.
ఈ గుజ్జులో కొన్ని అల్లం ముక్కలు, అర టీ స్పూన్ నిమ్మరసం, కొంచెం నీరు కలిపి మిక్సీలో ఆడండి.
ఆ మిశ్రమాన్ని వడబోసి కొంచెం తేనె లేదా పంచదార వేసుకుని తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
గమనిక: ఈ చిట్కాను పాటించే ముందు వైద్యులు, నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా మనవి.