దాదాపు ప్రతీ చైనీస్ ఫుడ్ లోనూ సోయా సాస్ అనేది పక్కాగా ఉంటుంది. దీని వల్ల ఫుడ్ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది.

అయితే ఈ సోయా సాస్ వల్ల ప్రయోజనాలతో పాటు దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా?

సోయా సాస్ లో సోడియం అధికంగా ఉంటుంది. ఈ కారణంగా రక్తపోటు పెరిగిపోతుంది. రక్తపోటు ఉన్నవారు సోయా సాస్ ని తినకపోవడమే మంచిది.

అలర్జీ, ఉదరకుహర వ్యాధి ఉన్నవాళ్లు సోయా సాస్ తినకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే గోధుమలు, గ్లూటెన్ మీ సమస్యలను ఇంకా పెంచుతాయి.

సోయా సాస్ మరింత రుచి రావడం కోసం మోనోసోడియం గ్లుటామేట్ కలుపుతారు. 

ఇది జీర్ణక్రియ రుగ్మతలు, పునరుత్పత్తి అవయవాలపై హానికరమైన ప్రభావం చూపుతుంది.

ఈ సోయా సాస్ ఎక్కువగా తినడం వల్ల తలనొప్పి, వికారం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి.

సోయా సాస్ లో ఉండే హిస్టామిన్ చర్మంపై దద్దుర్లు, చెమట, ఉదర సంబంధిత సమస్యలు, తలనొప్పి, మైకం వంటి సమస్యలు వస్తాయి.

సోయా సాస్ తీసుకోవాల్సి వస్తే టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ తినకండి.

ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఇంట్లో తయారుచేసిన సోయా సాస్ ని తినడం మంచిది. అది కూడా తక్కువ మోతాదులోనే తినాలి.

సోయా సాస్ మితంగా తింటే ఆరోగ్యానికి మంచిదే అని నిపుణులు అంటున్నారు.

సోయా సాస్ లో ఉండే ప్రోబయోటిక్ లక్షణాలు, పాలీఫెనాల్స్  జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తాయి. 

ఆహారం సులువుగా జీర్ణం అయ్యేందుకు తోడ్పడతాయి.

సోయా సాస్ లో ఉండే యాంటీ-ట్యూమరిజెనిక్, యాంటీ మ్యూటాజెనిక్ లక్షణాలు కణతులను తగ్గించేందుకు కృషి చేస్తాయి.

సోయా సాస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని ఆపుతాయి.

సోయా సాస్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువగా తింటే నష్టాలు కూడా ఉంటాయి.

గమనిక: మీకు దీని మీద అనుమానాలు ఉంటే వైద్యుడ్ని సంప్రదించాల్సిందిగా మనవి.