కారంతో బరువు తగ్గుతారని కొంతమంది కారాన్ని కూరల్లో ఎక్కువగా వాడుతుంటారు.
టేస్ట్ కోసం, స్పైసీనెస్ కోసం కొంతమంది ఎక్కువగా వేసుకుంటారు.
ఇలా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు.
డయేరియా, కడుపులో పుండ్లు ఏర్పడటం, ఎసిడిటీ, గుండెలో మంట, పేగు సంబంధిత సమస్యలు, పొత్తి కడుపు నొప్పి, కడుపు మండుతున్నట్టు అనుభూతి కలగడం వంటి సమస్యలు కలుగుతాయి.
డయేరియా కారం ఎక్కువగా తింటే డయేరియా వచ్చే అవకాశం ఉంది. కారం వల్ల విపరీతంగా విరేచనాలు అవుతాయి. దీని వల్ల ఒంట్లో ఓపిక పోయి నీరసమైపోతారు.
ఎసిడిటీ కారం ఎక్కువగా తినడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. జీర్ణ సమస్యలు వస్తాయి. గుండెలో మంట కూడా వస్తుంది కొంతమందికి. అందుకే కూరల్లో కారం తగ్గించుకోవాలి.
కడుపులో పుండ్లు మోతాదుకు మించి కారం తినడం వల్ల కడుపులో పుండ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
కారం పేగులకు, కడుపుకి అతుక్కుపోతుంది. దీని వల్ల అల్సర్ కి దారి తీస్తుంది. అందుకే కారాన్ని ఎక్కువ తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు కారం అతిగా తినడం వల్ల గొంతు క్యాన్సర్, నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
గమనిక: కారం ఎంత మోతాదులో తినాలో అనే విషయాన్ని వైద్యుడ్ని అడిగి తెలుసుకోవాల్సిందిగా మనవి.