చలికాలంలో చెవినొప్పి రావడం నార్మల్. చెవితో పాటు ఆ చుట్టుపక్కల కూడా బాగా నొప్పిగా ఉంటుంది.

ఈ నొప్పి కాస్త మెదడు వరకు చేరుతుంది. నిజానికి చల్లదనం వల్ల వస్తుందని అనుకుంటారు.

కానీ ఈ చెవి నొప్పికి ఒకటి కాదు చాలా కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇలా చలికాలంలో వచ్చే చెవి నొప్పిని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

చలికాలంలో జలుబుతో బాధపడేవారికి కొందరికి చెవినొప్పి కూడా వస్తుంది. అప్పుడప్పుడు చెవి మధ్యభాగంలో ద్రవం పేరుకుపోవడమే ఇందుకు కారణం.

మీరు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చెవి లోపల కొంత ఒత్తిడి కలుగుతుంది. జలుబు ఎక్కువ రోజులుంటే.. అది చెవిలో చికాకు లేదా నొప్పి పుట్టేలా చేస్తుంది.

సైనస్ ప్రాబ్లం ఉన్నవాళ్లని చలికాలంలో చెవినొప్పి వేధిస్తుంది. వీళ్లు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చెవిపై ఒత్తిడి పడుతుంది.

శీతాకాలంలో చల్లని గాలి వల్ల చెవి లోపల నరాలు ఒత్తిడికి గురవుతాయి. దీంతో చెవితో పాటు దాని చుట్టుపక్కలా నొప్పి ఏర్పడుతుంది.

చలికాలంలో బయటకెళ్లేటప్పుడు చెవులను కచ్చితంగా కవర్ చేసుకోండి. సైనస్, దగ్గు, జలుబు ఉన్నవారు.. క్రమం తప్పకుండా మెడిసన్ తీసుకోండి.

చెవులు క్లీన్ చేయడానికి హెయిన్ పిన్స్, అగ్గిపుల్లలు అస్సలు ఉపయోగించకండి. డాక్టర్ సలహా లేకుండా ఇయర్ డ్రాప్స్ వేసుకోవద్దు.

చెవిలో సమస్యగా అనిపిస్తే ENT స్పెషలిస్ట్ ని సంప్రదించండి. లేదంటే సీరియస్ అయి చెవుడు వచ్చే ప్రమాదం ఉంటుంది.

పెయిన్ కిల్లర్స్, యాంటీ బయోటిక్స్, అలెర్జీ మందులు వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోండి.

చెవి నొప్పిగా అనిపిస్తే.. గోరువెచ్చని నీటితో తడిపిన బట్టని చెవిపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది.

చెవిలో నీళ్లుంటే నొప్పిగా అనిపిస్తుంది. అందుకే చెవిని ఎప్పుడు పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి.

చలికాలంలో అందరూ టోపీ, హెడ్ బ్యాండ్, స్కార్ఫ్ ఉపయోగించి చెవులను వెచ్చగా ఉంచండి.

ఈ చిట్కాలు పాటిస్తే.. చలికాలంలో చెవినొప్పి వచ్చే ఛాన్స్ చాలావరకు తగ్గుతుంది. నొప్పి ఉన్నా సరే ఉపశమనం లభిస్తుంది.

నోట్: ఈ టిప్స్ పాటించేముందు ఓసారి డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.