తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో అగ్ర హీరోల సరసన నటించింది.
చిన్న వయసులోనే టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ పంజాబీ ముద్దు గుమ్మ.
హీరోయిన్ గా ఉన్న సమయంలో సినిమాల్లోనూ, పాటల్లోనూ ఆమె గ్లామర్ ట్రీట్ కి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయేవారు.
హీరోయిన్ గా తన అధ్యాయం ముగిసిన తర్వాత ఐటం సాంగ్స్ తో మరొక అధ్యాయాన్ని తెరిచి ఉక్కపోత పెట్టించింది.
ప్రస్తుతం నిర్మాతగా మారి పూరీ జగన్నాధ్ తో కలిసి సినిమాలను నిర్మిస్తోంది.
ఆమె ఛార్మింగ్ గర్ల్ ఛార్మి కౌర్. ‘నీ తోడు కావాలి’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఛార్మి.. శ్రీ ఆంజనేయం, గౌరీ, మాస్ వంటి సినిమాల్లో నటించి క్రేజ్ దక్కించుకుంది.
గ్లామర్ పాత్రలే కాకుండా ‘అనుకోకుండా ఒక రోజు’ వంటి విభిన్నమైన సినిమాతో కూడా అలరించింది.
వెంకటేష్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి హీరోల సరసన నటించిన ఛార్మి.. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో ఐటం సాంగ్స్ లో మెరిసింది.
వెంకటేష్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి హీరోల సరసన నటించిన ఛార్మి..
ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో ఐటం సాంగ్స్ లో మెరిసింది.
జ్యోతిలక్ష్మి సినిమాతో నిర్మాతగా మారిన ఛార్మి.. రోగ్, పైసా వసూల్, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలతో లాభాల బాట పట్టింది.
అయితే వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న ఛార్మికి.. లైగర్ సినిమా బాగా నిరాశపరిచింది.
ప్రస్తుతం జనగణమన సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తోంది.