మనిషి కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ఇంతకంటే తక్కువ గంటలు నిద్రపోతే అనారోగ్య సమస్యలు తప్పవు.

కొంతమందికి రాత్రి పూట అస్తమానూ మెలకువ వస్తుంది. పని లేకపోయినా ఊరికే మెలకువ వస్తుంది.

మళ్ళీ నిద్రలోకి వెళ్లాలంటే సమయం పడుతుంది. దీని వల్ల నిద్ర సరిపోదు. ఫలితంగా అనారోగ్యం కలుగుతుంది.

ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఇలా చేయండి.

రాత్రి పూట కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినకండి. బంగాళదుంపలు, అరటిపండ్లు, చిప్స్, పాస్తా వంటి వాటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. 

ఇవి నిద్రకు భంగపాటు కలిగిస్తాయి.

మెగ్నీషియం నిద్రకి భంగం కలిగిస్తుంది. మెగ్నీషియం ఉన్న గుమ్మడి గింజలు, ఆకుకూరలు, బాదం, అవొకాడో వంటివి రాత్రి పడుకునే ముందు తినకపోవడం మంచిది.

టీ, కాఫీ తాగకూడదు. ఎందుకంటే వీటిలో ఉండే కెఫీన్ మనిషిని రీఫ్రెష్ చేసి మత్తు పోగొడుతుంది. అందుకే పని చేసే వాళ్ళు నిద్ర రాకుండా ఉండడం కోసం టీ తాగుతారు.

మరి ప్రశాంతంగా పడుకునే ముందు టీ, కాఫీలు తాగితే నిద్ర ఎలా పడుతుంది చెప్పండి. 

ఇంకా పాలు తాగితే మత్తుగా నిద్ర పడుతుంది. ఒకవేళ టీ, కాఫీ తాగాలనుకుంటే నిద్రపోవడానికి 3 గంటల ముందు తాగచ్చు.

ఈరోజుల్లో ఒత్తిడి లేని మనిషి లేడు. అయితే పడుకునే ముందు ఒత్తిడితో ఉంటే నిద్ర సరిగా పట్టదు. మధ్య మధ్యలో మెలకువ వచ్చేస్తుంటుంది.

అందుకే వీలైనంత వరకూ ఒత్తిడిని దూరం చేసుకోండి. అప్పుడే ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

రాత్రి పడుకునే ముందు ఒక అరగంట సేపు వ్యాయాయం చేస్తే ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

ఉదయాన్నే ఎండలో సూర్యరశ్మి ముందు నిలబడితే.. మంచి ప్రయోజనం ఉంటుంది.

ఎంప్టీ మైండ్ తో పడుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకండి.

నోట్: ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాశాం. నెటిజన్స్ గమనించగలరు.