బొప్పాయి కాయని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. ఒకవేళ అలా అని తినడం మానేస్తే.. ఎన్నో ప్రయోజనాలు మిస్ చేసుకున్నట్లే.

ఎందుకంటే పచ్చి బొప్పాయి, ఎన్నో అనారోగ్య సమస్యల్ని తగ్గిస్తుంది.

దీనిలో ప్రోటీన్స్, విటమిన్స్, ఫైటో న్యూట్రియెంట్స్, ఎంజైమ్స్ లాంటి పోషకాలు ఎన్నో ఉంటాయి.

బొప్పాయి కాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల గాయలు త్వరగా మానడానికి సహాయపడతాయి.

ఇవి తింటే జీర్ణక్రియని మెరుగుపడుతుంది. దీని వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

పచ్చి బొప్పాయిలోని డైటరీ ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది.

దీని వల్ల జీర్ణాశయంలోని ప్రయోజనకర బ్యాక్టీరియాగా ఆహారంగా మారుతుంది. గట్ ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

పచ్చి బొప్పాయి.. డెంగ్యూ జ్వరం త్వరగా తగ్గించేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది.

బొప్పాయి ఆకుల రసం తాగడం వల్ల ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

పచ్చి బొప్పాయిలోని ఎంజైమ్స్.. మీ పొట్టని బాగా శుభ్రపరుస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఇది నివారిస్తుంది.

ఆకుపచ్చని బొప్పాయిలో ఎన్నో ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి బాడీలోని గ్లూకోజ్ స్థాయిలని కంట్రోల్లో ఉంచేందుకు సహాయపడతాయి.

ఈ ఖనిజాలు ఇన్సులిన్ రిలీజ్ ని పెంచడానికి కూడా సహాయపడతాయి. 

 టైప్ 2 డయాబెటిస్ కి కారణమయ్యే మెయిన్ ఎంజైమ్స్ కి ఇవి వ్యతిరేకంగా పనిచేస్తాయి.

నోట్: మేం చెప్పిన టిప్స్ పాటించే ముందు ఓసారి మీ దగ్గరలోని వైద్యులు, నిపుణుల సలహా కూడా తీసుకోండి