ఈ కాలం పిల్లలు అన్ని విషయాల్లో చాలా చురుగ్గా ఉంటున్నారు. మారుతున్న పోటీ ప్రపంచాన్ని అనుగుణంగా పిల్లల ఆలోచన శైలీలో కూడా మార్పులు సంభవిస్తున్నాయి.

కొంత మంది పిల్లలు అయితే తల్లిదండ్రులను సతాయిస్తూ చెప్పన మాట అసలే వినరు.

పిల్లలు అల్లరిని భరించలేని చాలా మంది తల్లిదండ్రులు 5 ఏళ్ల వయసు రాగానే హాస్టల్ లో చేర్పించి చదివిస్తుంటారు. 

కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు చెప్పిన మాట వినకపోవడంతో వారిని మందలిస్తుంటారు.

తల్లిదండ్రులు పిల్లలను మందలించడంతో భరించలేని కొందరు పిల్లలు మనస్థాపానికి గురై చివరికి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుంటారు.

ఇలాంటి పిల్లల విషయంలో వారిని మందలించకుండా వారిని ఎలా దారికి తెచ్చుకోవాలో తెలియాలంటే ఈ స్టోరి చదవాల్సిందే.

పిల్లలు చెప్పిన మాట వినకుండా మారం చేస్తుంటే వారిపై కోపం తెచ్చుకోకుండా మొదటగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి.

పిల్లలు మీరు చెప్పిన మాట వినకపోతే దాని వలన కలిగే నష్టాలను పూసగుచ్చినట్లుగా వివరించే ప్రయత్నం చేయాలి.

పిల్లలతో మీరు చాలా ఎక్కువ సమయం గడపాలి. వారికి నచ్చిన కథలు చెప్తూ వారితో సరదాగ మాట్లాడుతుండాలి.

ఎప్పుడైన కానీ మీ పిల్లలు చెప్పిన మాట వినకపోతే పక్కంటి బాలుడు అలా, ఎదురింటి అమ్మాయి ఇలా అని ఇతరులతో పోల్చవద్దు.

ఇలా ఇతరు పిల్లల గురించి మీ పిల్లల ముందే చెబితే మీ మాట అస్సలు లెక్కచేయడమే కాకుండా వాళ్లని తక్కువ చేసి మాట్లాడినందుకు బాధపడే అవకాశం ఉంటుంది.

ముందుగా మీ పిల్లలు చెప్పేది తప్పైనా సరే మొదటగా వారు ఏం చెబుతున్నారో వినండి. ఆ తర్వాత తప్పు ఏంటి, ఒప్పు ఏంటనేది వివరించే ప్రయత్నం చేయాలి. 

ఇలా చేసినట్లైతే మీ పిల్లలను మీరు దారికి తెచ్చుకున్నవారవుతారు.