చలికాలంలో ఆరోగ్యం కోసం మరింత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.

నారింజ జ్యూస్ తీసుకుంటే చర్మంపై ముడతలు పడకుండా టైట్ గా ఉండే కొలాజిన్ ఉత్పత్తి పెరుగుతుందట.

నారింజ వల్ల ముఖంపై వృద్ధాప్య ఛాయలు కూడా తగ్గుతాయని తెలుస్తోంది. మొటిమలు, మచ్చలు తగ్గి చర్మ నిగారింపు పెరుగుతుందట.

శీతాకాలంలో దగ్గు, జ్వరం, జలుపు, వైరల్ ఇన్ఫెక్షన్స్ తో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు రావడం చాలా నార్మల్.

శీతాకాలంలో దగ్గు, జ్వరం, జలుపు, వైరల్ ఇన్ఫెక్షన్స్ తో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు రావడం చాలా నార్మల్.

ముఖ్యంగా ఈ సీజన్ లో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీని వల్ల ఎన్నో రోగాలు, అంటువ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

అందుకే ఇమ్యూనిటి పవర్ పెరిగేందుకు రోజుకి ఓ నారింజ పండు తింటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు అంటున్నారు.

నారింజ వల్ల జీర్ణవ్యవస్థకు మంచి ప్రయోజనం చేకూరుతుందట. దీనిలోని ఫైబర్ వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుందట.

నారింజ వల్ల కడుపులో కొవ్వు వేగంగా కరుగుతుంది. దీనిలోని ఫైబర్ వల్ల కడుపు నిండుగా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.

నారింజ వల్ల గుండె సంబంధిత సమస్యలు  తగ్గడానికి సహాయపడుతుంది. స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

నారిజంలోని కాల్షియం వల్ల మీ దంతాలు, ఎముకులు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందట. ఇది లోపిస్తే వెంట్రుకలు ఊడిపోయే ప్రమాదం కూడా ఉంది.

నారింజ పండు తినడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి. మచ్చలు మటుమాయం అవుతాయి. ముఖం అందంగా మెరిసిపోతుంది. గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి.

నారింజ తొక్కని ఉపయోగించి ముఖాన్ని అందంగా, మృదువుగా చేయొచ్చు.

నారింజ పండుతో మూత్రంలోని సిట్రేట్ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల కిడ్నీలోని రాళ్లు కరుగుతాయి.