టమాటాలు మంచి పోషకాలున్న సూపర్ ఫుడ్. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

టమాటాల్లోని లుటిన్, లైకోపీన్ లాంటి కెరోటినాయిడ్స్.. కంటి సమస్యల రాకుండా కాపాడుతాయి.

టమాటాల్లోని విటమిన్ సీ, ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. 

అలానే ఇందులోని లైకోపీన్ వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా నిరోధించొచ్చట.

టమాటాల్లోకి బీటా కెరోటిన్ వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదం తగ్గించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

టమాటాల్లో  ఉండే పీచు, పొటాషియం, కొలిన్.. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడతాయి. 

దీంతో హృదయ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

టైప్ 1 డయాబెటిస్ ఉన్నవాళ్లు.. టమాట తీసుకుంటే గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు.. టమాటాలు రోజూ తినడం వల్ల చక్కెర, లిపిడ్లు, ఇన్సులిన్ స్థాయిలు మెరుగుపడతాయి.

అలానే టమాటాల్లోని వాటర్ కంటెంట్ వల్ల శరీరం ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంటుంది. ప్రేగు కదలికలు కూడా మెరుగుపడతాయి.

టమాటాల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, లైకోపీన్ లాంటి వాటివల్ల.. కంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

టమాటాలు రోజూ తినడం వల్ల మీ బరువుని కూడా అదుపులో ఉంచొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట.

టమాటాల్లోని కెరోటినాయుడ్లు, లూటిన్, జియాక్సంతిన్.. కంటి సమస్యల్ని 35 శాతం వరకు తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

స్కర్వీ వ్యాధి రాకుండా ఉండాలన్నా సరే టమాటాలు రోజూవారీ ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

శిశువులలో న్యూరల్ ట్యూబ్ లోపాల నుంచి రక్షించడానికి తగినంత ఫోలేట్ అవసరం. దీన్ని కూడా టమాటాలు తీసుకోవడం ద్వారా పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.