గసగసాలు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

గసగసాల్లో ఉండే జింక్.. థైరాయిడ్ గ్రంధి పనితీరుని మెరుగుపరుస్తుంది.

గసగసాల్లో ఉండే మాంగనీస్ మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

స్త్రీ సంతానోత్పత్తి సమస్యలు ఉన్నవారు  తమ ఆహారంలో గసగసాలు చేర్చుకోవాలి.

ఇలా చేయడం వల్ల ఫెలోపియన్ ట్యూబ్ నుంచి శ్లేష్మాన్ని తొలగిస్తుంది. దీని వల్ల సంతానోత్పత్తి పెరుగుతుంది.

గసగసాల్లో ఉండే కాపర్, కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతాయి. ఎముకలు బలహీనంగా ఉన్న వారు గసగసాలు తింటే స్ట్రాంగ్ అవుతాయి.

గసగసాల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. 

గసగసాలను, నిమ్మరసం ముద్దగా చేసి చర్మంపై పూసుకుంటే దురద రాదు.   

తలస్నానం చేసే ముందు గసగసాలు, పెరుగు కలిపి పేస్ట్ లా చేసుకుని.. జుట్టుకు అప్లై చేయాలి. 

ఒక గంట తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్యలు తగ్గుతాయి.  

గసగసాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడతాయి.

గసగసాల్లో ఉండే జింక్.. చలి, జ్వరం, గొంతు నొప్పి, శ్వాస కోశ సమస్యలను నిరోధిస్తుంది.

గసగసాల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

నరాల సమస్యలు, నిద్రలేమితనం, గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో గసగసాలు కీలక పాత్ర పోషిస్తాయి.