ప్రతి ఒక్కరికి జాజికాయ గురించి తెలుసు. ఇది మసాలా దినుసుల జాబితాకు చెందుతుంది.
జాజికాయను పురాతన కాలం నుంచి భారతీయులు తమ వంట ఇళ్లలో ఉపయోగిస్తున్నారు.
జాజియా పొడిని వంటకాల్లో చక్కని రుచి, వాసన రావడానికి ఉపయోగిస్తారు.
జాజికాయల వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
ఆడవారి అందం పెంచడానికి, మగవారికి ఆ సామర్థ్యం పెంచడానికి జాజికాయ బాగా ఉపయోగపడుతుంది.
ఇండోనేషియా, మలేషియా, గ్రెనడా వంటి దేశాల‌్లో జాజికాయ ఎక్కువగా పండుతుంది.
అర స్పూన్ జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తాగితే శృంగార సామర్థ్యం పెరుగుతుందంట.
జాజికాయను నేతిలో గోరు వెచ్చగా వేయించి పొడి చేసుకుని డబ్బాలో భద్రపరుచుకోవాలి.
ఐదు గ్రాముల చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం గోరువెచ్చని ఆవుపాలతో కలిపి తాగాలి.
ఈ జాజికాయ పొడి నరాల బలహీనతకు చెక్ పెట్టి మగతనాన్ని రెచ్చగొడుతుంది.
ఈ పొడి వీర్యాన్ని వృద్ధి చేసి.. నపుంసకత్వాన్ని తరిమి కొడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆడవారి అందం పెంచడంలోనూ ఈ జాజికాయ ఎంతో ఉపయోగడుతుంది.
అయితే ఏదైన అనారోగ్య సమస్య ఉన్నప్పుడు వైద్యుల సూచనల మేరకు ఉపయోగించడం మంచింది.