2016లో కేంద్రం పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
2016లో కేంద్రం పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
1000 నోట్ల స్థానంలో రూ. 2 వేల నోట్లను ప్రవేశపెట్టింది ఆర్బీఐ.
అయితే 2 వేల నోట్ల ముద్రణకు సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది.
ఆర్బీఐ కొత్త 2 వేల నోట్ల ముద్రణ నిలిపివేసిందట.
2016 నవంబర్ 8న ఆర్బీఐ 2 వేల నోట్లను ప్రవేశపెట్టింది. అయితే ఆ తర్వాత క్రమకమ్రంగా 2 వేల నోట్ల చలామణి తగ్గిపోయింది.
దీని వెనుక ఉన్న అసలు కారణం ఆర్బీఐ గత 3 ఏళ్లుగా నోట్లను ముద్రించలేదట.
2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో కొత్త 2 వేల నోట్లను ముద్రించలేదట.
RTI (రైట్ టు ఇన్ఫర్మేషన్) కి ఒక వ్యక్తి 2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయా? లేదా? అని అడగగా ఆర్బీఐ ప్రత్యుత్తరం ఇచ్చింది.
ప్రత్యుత్తరం ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,5429.91 కోట్ల 2 వేల రూపాయల నోట్లను ముద్రించినట్టు తెలిపింది.